తెలంగాణ

వేషభాషలు వేరైనా మనమంతా ఒక్కటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: వేషభాషలు వేరైనా మనమంతా ఒక్కటే అని గుర్తించాలని ఏబీవీపీ నిర్వహించిన ‘స్టూడెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇంటర్‌స్టేట్ లివింగ్ (సెయిల్)’ సన్నద్ధ కార్యక్రమంలో ఏబీవీపీ దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి జీ బాలకృష్ణ పేర్కొన్నారు. త్వరలో జరగబోయే సెయిల్ కార్యక్రమ నిర్వహణపై ఉస్మానియా యూనివర్శిటీ అతిథిగృహం మినీ సెమినార్ హాల్‌లో జరిగిన భేటీని నార్త్ ఈస్టు క్షేత్ర సంఘటన కార్యదర్శి నీరవ్ గెలాని , బాలకృష్ణలు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సన్నద్ధ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సమన్వయకర్తలు పాల్గొన్నారు. సెయిల్ కార్యక్రమంలో ఈశాన్యరాష్ట్ర విద్యార్థులు దేశంలో వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నారని వారు చెప్పారు. అందులో భాగంగా వారు తెలంగాణ పర్యటనకు వస్తారని, దేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతులు సంప్రదాయాలను వారు తెలుసుకునే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ సంస్కృతి సంప్రదయాలనూ వారు అధ్యయనం చేస్తారని తెలిపారు.
సాధారణంగా ఈశాన్య రాష్ట్ర ప్రజల్లో దేశంలో తాము వేరు అనే భావనతో కొనసాగడం అలవాటుగా మారిందని, కానీ వేష భాషలు వేరైనా మనమంతా ఒక్కటే అనేభావన కల్పించేందుకు ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం సెయిల్ పేరుతో ఈశాన్య రాష్ట్ర విద్యార్థులు జనవరి మాసంలో వివిధ రాష్ట్రాలలో పర్యటనకు సన్నాహాలు చేస్తోందని, తెలంగాణకు సైతం దాదాపు 30 మంది ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు వస్తున్నట్టు ఏబీవీపీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి పగిడిపల్లి శ్రీహరి తెలిపారు.