తెలంగాణ

మద్యం షాపులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: మద్యం షాపుల లైసెన్స్‌ల దరఖాస్తుల స్వీకరణ బుధవారం ప్రారంభమైంది. ఈ నెల 16 దరఖాస్తులకు చివరి గడువు. ఈ నెల 18న వచ్చిన దరఖాస్తులను లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. మొదటి రోజు రాష్టవ్య్రాప్తంగా వచ్చిన దరఖాస్తులపై ఎక్సైజుశాఖ మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ ఆబ్కారి భవన్‌లో ఎక్సైజు ఉన్నతాధికారులతో సమీక్షించారు. మద్యం షాపుల లైసెన్స్‌ల జారీ దరఖాస్తులకు జిల్లా వారీగా చేసిన ఏర్పట్లను మంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్టవ్య్రాప్తంగా 33 జిల్లాల్లో 34 దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. మద్యం దరఖాస్తుల స్వీకరణ నుంచి లాటరీ పద్ధతిలో షాపుల ఎంపిక ప్రక్రియను ఆబ్కారీ భవన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్‌ను మంత్రి పరిశీలించారు. టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి దరఖాస్తుదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించాలని మంత్రి ఆదేశించారు. మద్యం షాపుల లైసెన్స్‌ల జారీని పూర్తిగా పారదర్శకంగా ఉండాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.

*చిత్రం...ఆబ్కారీ భవన్‌లో బుధవారం మద్యం షాపుల దరఖాస్తుల స్వీకరణపై అధికారులతో సమీక్షిస్తున్న ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్‌గౌడ్