తెలంగాణ

ఆర్టీసీ కార్మికుల తొలగింపు నిర్ణయం అప్రజాస్యామికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: ఆర్టీసీ కార్మికులు 45 వేల మందిని ఒకేసారి తొలగిస్తామనడం అప్రజాస్వామికమని శాసనసభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు భట్టి విక్రమార్క ఖండించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని భట్టి ఆరోపించారు. సీఎల్పీ కార్యాలయంలో బుధవారం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ, ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. ఆర్టీసీ బస్సుల డీజిల్ భారాన్ని ప్రభుత్వమై భరించాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. ఇంధనంపై ఏ రాష్ట్రంలో లేనంత వ్యాట్‌ను తెలంగాణ ప్రభుత్వం విధించిందన్నారు. డీజిల్ ధరలు రెట్టింపు అయ్యాయన్నారు. డీజిల్ ధర పెంపు వల్ల ఆర్టీసీపై భారం పడకుండా మద్యంతో పాటు ప్రభుత్వానికి ఇతరత్రా వచ్చే ఆదాయంతో పూడ్చలన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు గొంతెమ్మ కోరికలేం కావని భట్టి అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ సమ్మెపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ట్వీట్టర్‌లో ప్రతి అంశంపై స్పందించే కేటీఆర్, ఆర్టీసీ సమ్మెపై ఎందుకు స్పందించలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని అన్నారు. యాబై వేల మంది ఆర్టీసీ కార్మికుల బాధలు ప్రభుత్వానికి కనిపించడం లేదా? అని పొన్నం ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులను తొలగిస్తే 50 వేల కుటుంబాలు బజారు పడుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెపై కేటీఆర్ ఇప్పటికైనా స్పందించకుంటే ప్రజల దృష్టిలో ఆయన ద్రోహిగా మిగులుతారని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని పొన్నం ప్రకటించారు.

*చిత్రం... సీఎల్పీ నేత భట్టి విక్రమార్క