తెలంగాణ

మారకుంటే.. ప్రజలే కేసీఆర్‌ను మారుస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 18: ముఖ్యమంత్రి కేసీఆర్ తన తీరును మార్చుకోకుంటే ప్రజలే ఆయనను మార్చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ, ఆ వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని అన్నారు. నిరంకుశ, రాజరిక, నియంతృత్వ పోకడపలను తెలియజేసినట్టు రాష్ట్ర ప్రజలు తిరగబడితే ఎవ్వరూ అడ్డుకోలేరని , ప్రజాస్వామ్యంలో ప్రజలు శక్తివంతులని గుర్తుంచుకోవాలని హైకోర్టు చేసిన వ్యాఖ్యలను మననంలో ఉంచుకోవాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో భాగంగా తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు బీజేపీ పూర్తి మద్దతు ఇస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ బంద్‌లో రాష్ట్ర , జిల్లా మండల , గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులుచేస్తున్న సమ్మెకు వ్యాపారులు, వాణిజ్యవేత్తలు, కార్మికులు, మేథావులు మద్దతు ఇస్తూ సహకరించాలని కోరారు. హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరపడం పట్ల బీజేపీ స్వాగతించింది.
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంకుశ, రాజరిక, నియంతృత్వ పోకడలకు పోతున్నారని అన్నారు. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలని, కానీ ముఖ్యమంత్రి తన సొంత రాజ్యాంగం, నయా నిజాం పోకడలను ప్రదర్శిస్తున్నారని అన్నారు. నిజాం పోకడలను మానుకోకపోతే ప్రజల నుండి తీవ్ర ప్రతి ఘటన ఎదుర్కోవల్సి వస్తుందని అన్నారు. నిరంకుశ వైఖరితో ఆర్టీసీ ఉద్యమాన్ని అణచివేస్తున్న ప్రభుత్వం అక్రమకేసులకు పాల్పడకుండా బెదిరింపు ఆలోచనలను మానుకోవాలని లక్ష్మణ్ హితవుపలికారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ఆమోదించాలని, వెంటనే ఎండీని నియమించాలని పేర్కొన్నారు.
కాగా బీజేపీ నేతలు బీహెచ్‌ఈఎల్ నుండి కూకట్‌పల్లి వరకూ భారీ బైక్‌ర్యాలీని నిర్వహించారు. కాగా శనివారం నాడు నిర్వహించే బంద్‌ను అంతా సహకరించి విజయవంతం చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు పిలుపునిచ్చారు.
హైకోర్టు ఆదేశాలను స్వాగతించిన బీజేపీ
హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్టు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ పేర్కొన్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల సంఘాల నాయకులతో చర్చలు ప్రారంభించాలన్న హైకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. దాటవేత ధోరణితో పనిచేస్తున్న అధికారులకు చర్చల అంశం అప్పగిస్తే వారికి నిర్ణయం తీసుకునే శక్తి, స్వేచ్ఛ లేదన్న సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసని అన్నారు.
కిషన్‌రెడ్డి సంకల్ప యాత్ర
కేంద్ర హోం శాఖా సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి శుక్రవారం నాడు సంకల్పయాత్రలో పాల్గొన్నారు. గాంధీజీ స్వాతంత్య్రం కన్నా స్వచ్ఛ భారత్ ముఖ్యమని నమ్మారని , గాంధీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న ప్రధాని నరేంద్రమోదీ సూచనతో నియోజకవర్గంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్టు చెప్పారు. అక్టోబర్ 2 నుండి తాను సంకల్ప యాత్ర నిర్వహిస్తున్నానని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు, స్వచ్ఛ భారత్‌కు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన సూచించారు. కాగా బీజేపీ అభ్యర్ధి తరఫున కిషన్‌రెడ్డి శనివారం నాడు హుజూర్‌నగర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గోనున్నారు.