తెలంగాణ

జూనియర్ లైన్‌మెన్, అసిస్టెంట్ ఉద్యోగాలకు శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 19: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్ శాఖలోని 3025 జూనియర్ లైన్ మెన్, జూనియర్ అసిస్టేంట్ తదితర ఉద్యోగాలకు బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నవంబర్ మొదటి వారం నుండి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎన్.బాలాచారి తెలిపారు. ఉద్యోగ ఖాళీలు ప్రకటించిన ఆయా జిల్లాల పరిధిలోని బీసీ స్టడీ సర్కిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. అర్హత ఆసక్తి గల అభ్యర్థుల నుండి ఈనెల 23 నుంచి అక్టోబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు స్వీకరిస్తారు. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ స్టడీ సర్కిల్ డాట్ సీజీజీ డాట్ జీవోవీ డాట్ ఇన్ వెబ్ సైట్‌లో శిక్షణలో పాల్గొనే అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాల కోసం ఫోన్ నెంబర్ 040-24071178లో సంప్రదించాల్సి ఉంటుంది. కార్యాలయంలో నేరుగా కలిసి వారికి కావల్సిన వివరాలను తెలుసుకోవచ్చని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.