తెలంగాణ

ఫార్మాసిటీకి సాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేయతలపెట్టిన ‘ఫార్మాసిటీ’కి కేంద్రం ఉదారంగా సాయం చేయాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ సమీపంలోని రంగారెడ్డి జిల్లా పరిధి కడ్తాల్ దగ్గర
వేర్వేరు గ్రామాల రైతులను ఒప్పించి భూసేకరణ చేశామన్నారు. 64 వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఫార్మా కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు అంగీకరించాయని గుర్తు చేశారు. దాదాపు 5.60 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు అవకాశం ఉన్న ఫార్మా సిటీని జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్ (నిమ్జ్) గా సూత్రప్రాయంగా గుర్తించిన కేంద్రం నిమ్జ్ విధాన మార్గదర్శకాల మేరకు ఆర్థిక సాయంతో పాటు ఇతరత్రా చేయూత అందివ్వాలని కోరారు. ఫార్మాసిటీలో వౌలిక సదుపాయాల కల్పనకోసం 1,318 కోట్ల రూపాయలు సాంకేతిక సదుపాయాల కల్పన కోసం 2,100 కోట్ల రూపాయలు కేటాయించాలంటూ కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు కేటీఆర్ లేఖ రాశారు. ఈ మొత్తాన్ని గ్రాంట్‌గా మంజూరు చేయాలని కోరారు. ఫార్మాసిటీకి అవసరమైన సహజవాయువు (న్యాచురల్ గ్యాస్) ను ప్రిఫరెన్షియల్ టారిఫ్ ప్రాతిపదికన కేటాయించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు మరొక లేఖ రాశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మాసిటీ ప్రపంచంలోనే అతిపెద్ద సమీకృత ఫార్మాపార్క్‌గా పేరు వస్తోందని కేటీఆర్ తెలిపారు. దేశంలో ఫార్మా రంగం అభివృద్ధికి ఈ పార్క్ దోహదం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జాతీయ ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా ఫార్మాసిటీనీ గుర్తించిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇలా ఉండగా జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ (నిమ్జ్) గా దీనికి సూత్రప్రాయంగా గుర్తింపు ఇచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం స్ఫూర్తి మేరకే ఫార్మా సిటీకి రూపకల్పన చేశామన్నారు.
కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు మరో లేఖ రాస్తూ, ప్రతిపాదిత ఫార్మాసిటీ జీరో లిక్విడ్ డాస్చార్జ్ పద్ధతిలో కాలుష్య రహితంగా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందిస్తున్నామన్నారు. ఫార్మా సిటీ ప్రాజెక్టులో భాగంగా అంతర్జాతీయ స్థాయి ఫార్మా యూనివర్సిటీ, లాజిస్టిక్ పార్క్, ఫార్మా శిక్షణా కేంద్రం, పరిశోధనాశాలలు, కామన్ డ్రగ్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు ఉంటాయన్నారు. ఫార్మా రంగంలో స్టార్టప్‌లకు ప్రత్యేక హబ్ ఏర్పాటు చేస్తామన్నారు.
ఫార్మాసీటీ కోసం ఇప్పటి వరకు 19,333 ఎకరాలకు మాస్టర్ ప్లాన్ పూర్తయిందని, తొలిదశలో 8,400 ఎకరాలకు డిటైల్డ్ డిజైన్లు కూడా పూర్తయ్యాయని కేటీఆర్ తన లేఖలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పర్యావరణ అనుమతులను ఇచ్చిందన్నారు. మొదటిదశ పనులు ప్రారంభమయ్యాయన్నారు.
ఫార్మాసిటీలో ఏర్పాటు చేయనున్న కంపెనీల ఇంధన అవసరాలకోసం సహజవాయువును ప్రిఫరెన్షియల్ టారిఫ్ ప్రాతిపదికన కేటాయించాలని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కేటీఆర్ కోరారు. ప్రస్తుతం ఫార్మా కంపెనీలు బొగ్గును ఇంధనంగా వాడుతున్నాయని, అయితే గ్రీన్ ఇండస్ట్రియల్ కానె్సప్ట్ (కాలుష్య రహిత పద్ధతి) న ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీకోసం సహజవాయువు వాడాల్సి ఉంటుందన్నారు. బొగ్గుతో పోలిస్తే సహజవాయువును వినియోగించడం ఆర్థికంగా భారమే అవుతుందని, అందుకే ఫార్మారంగం అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకు సహజవాయువు సరఫరా చేయాలని కేటీఆర్ తన లేఖలో కేంద్ర మంత్రిని కోరారు. ఫార్మా కంపెనీలోని యూనిట్లకు రోజూ 3.4 ఎంఎంఎస్ సీఎండీ (మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ పర్ డే) కేటాయించాలని కేటీఆర్ కోరారు.

*చిత్రం...రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్