తెలంగాణ

రైల్వే లోకో పైలట్లకు హైటెక్ మాన్యువల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: రైల్వే ప్రయాణ సమయంలో రైలు ఇంజనుకు అనుకోని అవాంతరాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇబ్బందులు పరిష్కరించుకోవడానికి రైల్వేలోకో పైలట్లకు హైటెక్ మాన్యువల్‌ను సమకూర్చుతున్నారు. కొత్త విధానాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం నుంచి అమలు చేయనున్నారు. పైలట్లకు పని భారం తగ్గిస్తూనే. పని సామర్థ్యాన్ని పెంచేందుకు వారికి ఆండ్రాయిడ్ ట్యాబ్‌లను పంపిణీ చేశారు. రైళ్ల నిర్వహణలో లోకో పైలట్ల పాత్ర కీలకంగా ఉంటుంది. లోకో పైలట్లను నియమించే ముందు వారికి డ్రైవింగ్‌తో పాటు సిగ్నల్ విభాగాలకు సంబంధించిన సాంకేతిక, భద్రత నియమాలు, ఎలక్ట్రిక్, డీజల్ ఇంజన్లు పనిచేసే విధానంపై అవగాహన కల్పిస్తారు. అకస్మాత్‌గా ఇంజన్‌లో లోపాలు వస్తే సరిచేసుకోవడానికి కొత్త ఆండ్రాయిడ్ ట్యాబ్‌లతో సమస్యను పరిష్కరించుకోవచ్చునని అధికారులు తెలిపారు. గతంలో పాత విధానంలో 10 కేజీల బరువుతో ఉన్న పుస్తకాలను అందించేవారు. ఆపద సమయంలో ఆ పుస్తకాలు చదివి సమస్యను పరిష్కరించుకోవడానికి గంటల వ్యవధి సమయం పట్టేది. కొత్త మాన్యువల్‌ను తీసుకురావడంతో లోకో పైలట్లు క్షణంలో సమస్యను అధిగమించడానికి ఆండ్రాయిడ్ ట్యాబ్ ఉపయోగపడనున్నది.

*చిత్రం...రైలు ప్రయాణ సమయంలో ఎప్పటికప్పుడు ఇంజన్ పనిచేసే విధానాన్ని తెలుసుకోవడానికి ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను పరిశీలిస్తున్న లోకో పైలట్