తెలంగాణ

చిన్నపిల్లల ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనస్థలిపురం (హైదరాబాద్): చిన్నపిల్లల ఆసుపత్రి ఐసీయూలో షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన అగ్నిప్రమాదం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెండు నెలల బాలుడు తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో నలుగురు చిన్నారులకు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని మెరుగైన చికిత్స కోసం పలు ఆసుపత్రులకు తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉందని ఆయా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ గ్రామానికి చెందిన నగేష్, మానసకు రెండు నెలల క్రితం పుట్టిన బాబుకు వారం రోజుల క్రితం నిమోనియా సోకింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ చౌరస్తాలో గల షైన్ చిన్నపిల్లల ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ బాలుడితోపాటు మరో ఆరుగురు చిన్నారులు సైతం ఇదే ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ఆసుపత్రి ఐసీయూ విభాగంలో ఉన్న ఫ్రిజ్‌లో షార్ట్ సర్క్యూట్ వచ్చి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో చికిత్స పొందుతున్న రెండు నెలల బాలుడు తీవ్రంగా గాయపడగా వెంటనే ఆ చిన్నారిని మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. షైన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురు చిన్నారులు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వారిని నగరంలో పలు చిన్న పిల్లల ఆసుపత్రులకు తరలించగా వారి పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. తమ చిన్నారి మృతి చెందడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళన చేపట్టారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితుల ఫిర్యాదు మేరకు ఆసుపత్రి ఎండీ సునీల్ కుమార్‌రెడ్డిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆసుపత్రి ముందు బీజేపీ నేత ధర్నా
ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి బాబు మృతి చెందాడని ఆరోపిస్తూ ఎల్బీనగర్ బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఎలాంటి నిబంధనలు పాటించనందుకే ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగి చిన్నారి మృతి చెందాడని, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారని బీజేపీ నాయకుడు సామ రంగారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు ఆసుపత్రిని మూసివేసి యాజమాన్యంపై హత్య కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆసుపత్రి ముందు ఆందోళన చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ ధర్నాలో రంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు జక్కిడి ప్రభాకర్‌రెడ్డి, మాజీ చైర్మన్ ఆకుల రమేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ కళ్లెం రవీందర్‌రెడ్డి, బీజేపీ డివిజన్ అధ్యక్షుడు కడారి యాదగిరి యాదవ్, ఉగాది ఎల్లప్ప, నాయకులు శ్రీ్ధర్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు కొప్పుల నర్సింహారెడ్డి,
జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
ఆసుపత్రిని సీజ్ చేసిన అధికారులు.
సందర్శించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు
షైన్ చిన్నపిల్లల ఆసుపత్రిని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు సందర్శించి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. చిన్నారి బాబు మృతి గల కారణాలను వారి తల్లి దండ్రులను అడిగి తెసుకున్నారు. చిన్నారి మృతి పట్ల వారు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ వైద్యుల నిర్లక్ష్యం ఉన్నట్లయితే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.
*చిత్రాలు.. రోదిస్తున్న కుటుంబ సభ్యులు
*అగ్నిప్రమాదంలో మృతి చెందిన చిన్నారి (ఇన్‌సెట్‌లో )