తెలంగాణ

‘షైన్’ ఘటనపై హెచ్‌ఆర్‌సీలో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లోని షైన్ పిల్లల ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై మానవ హక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ)లో బాలల హక్కుల సంఘం పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక శాఖను బాధ్యులను చేయాలని ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఈ ఆసుపత్రి పై అంతస్తులో సోమవారం తెల్లవారుజామున 2.40 గంటలకు అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం విదితమే. ఘటన జరిగిన సమయంలో అయిదుగురు చిన్నారులు అదే అంతస్తులో ఇంక్యుబేటర్లపై చికిత్స పొందుతున్నారు. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో వీరిలో నాలుగు నెలల మగ శిశువు మృతి చెందగా, మరో ముగ్గురు చిన్నారులకు తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. చిన్నపిల్లల చికిత్స విషయంలో జాగ్రత్తలు పాటించని సదరు ఆసుపత్రి యాజమాన్యంపై కూడా చర్య తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది.