తెలంగాణ

ఆటంకం కలిగించవద్దు అడ్డుకోవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ కార్మికులు ఆందోళనకు దిగడంతో పరిస్థితి రోజు రోజుకు ఉద్రిక్తంగా మారుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మంగళవారం నాటితో 18వ రోజుకు చేరుకుంది. ఎపుడేం జరుగుతుందోనన్న వాతావరణం నెలకొంది. ఆర్టీసీ కార్మికులు సెమ్మెకు దిగడంతో ప్రజా రవాణా వ్యవస్థను గాడిలో పెట్టడానికి తాత్కాలిక సిబ్బందిని నియమించింది. ప్రభుత్వం ఈ క్రమంలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను రంగంలో దింపింది. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు ఆయా రూట్లలో విధులు నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని చోట్ల కార్మికలు నిరసనలో భాగంగా తాత్కాలిక సిబ్బందిపై చేయి చేసుకుంటున్న ఘటనలు, దాడులు వెలుగు చూస్తున్నాయి. ఈ విషయంలో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆర్టీసీ కార్మికులకు వార్నింగ్ ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న తాత్కాలిక సిబ్బందిన అడ్డుకున్న, వారిపై దాడి చేసిన ఆర్టీసీ కార్మికులపై కఠినంగా వ్యవహరిస్తామని హేచ్చరించారు. బస్సులను అడ్డుకున్న, తాత్కాలిక సిబ్బందిపై దాడికి దిగిన ఆలాంటి వారిని వెంటనే అరెస్టు చేసి ఫస్ట్‌ట్రాక్ కోర్టు ముందు హాజరుపరుస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సీపీ అంజనీ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు.