తెలంగాణ

బాలకార్మిక వ్యవస్థ లేని సమాజం నిర్మిద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: బాల కార్మిక వ్యవస్థలేని సమాజాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ పాటుపడాలని రాష్ట్ర ప్రణాళికా మండలి వైస్-చైర్మన్ బి. వినోద్‌కుమార్ సూచించారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జె. శ్రీనివాసరావు, సభ్యులు గురువారం వినోద్‌కుమార్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ, బాలబాలికలంతా చదువుకునేలా చూడాల్సి ఉందని, ఇందుకోసం బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చొరవ తీసుకుని విద్యాశాఖతో పాటు ఇతర శాఖలను సమన్వయం చేస్తూ పిల్లలంతా పాఠశాలలకు వెళ్లేలా చూడాలన్నారు. పిల్లల అభ్యున్నతి కోసం కృషి చేస్తేనే సమసమాజాన్ని నిర్మించేందుకు వీలవుతుందన్నారు. బాలలను ఉత్తమమైన వారిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను రూపొందించాలన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం కూడా అనేకచర్యలు తీసుకుంటోందని వినోద్‌కుమార్ గుర్తు చేశారు.
*చిత్రం... వినోద్‌కుమార్‌తో చర్చిస్తున్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్, సభ్యులు