తెలంగాణ

ఎన్నికకు.. సమ్మెకు సంబంధం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, అక్టోబర్ 24: హుజూర్‌నగర్ గెలుపు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నీచంగా మాట్లాడుతున్నాడని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్రశేఖర్ అన్నారు. గురువారం భూపాలపల్లి పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు, రిలే దీక్షలకు వారు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి సీపీఐ, సీపీఎం నాయకులతో పాటు ఏఐఎఫ్‌బీ రాష్ట్ర నాయకులు గండ్ర సత్యనారాయణరావు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ హుజూర్‌నగర్‌లో జరిగిన ఎన్నికకు సమ్మెకు ఎలాంటి సంబంధం లేదని, కావాలనే ముఖ్యమంత్రి తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించిన వారు ఆర్టీసీ కార్మికులని చెప్పిన ముఖ్యమంత్రి నేడు మీరు చేస్తున్న సమ్మెలు పనికి రావని, ఆర్టీసీ పని ముగిసిందని చెపుతున్నాడన్నారు. ఆర్టీసీ నష్టానికి యూనియన్లు కారణం కాదని, ప్రభుత్వమే కారణమని వారు విమర్శించారు. ఆర్టీసీ మీద పన్నులు వసూలు చేస్తున్నదని ఈ ప్రభుత్వమేనని, దేశంలో ఎక్కడా కూడా ఈ విధంగా లేదన్నారు. ఆర్టీసీకి ప్రభుత్వం 28 వందల కోట్ల బాకీ ఉందని ఈ సందర్భంగా అన్నారు. అనేక రాష్ట్రాలలో ఆర్టీసీకి రాయితీలు ఇస్తున్నారని, కానీ కేసీఆర్ ప్రభుత్వం ఏమిస్తుందని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనని, ప్రభుత్వంలో విలీనం చేయమనడం తప్పుకాదన్నారు. ఆర్టీసీ కార్మికులకు 50వేల వేతనాలు వస్తున్నాయని కేసీఆర్ అనడం సిగ్గుచేటన్నారు. ఇలాంటి అబద్ధాలు చెప్పడం వల్ల ప్రజల్లో ముఖ్యమంత్రి పలసనైపోతున్నాడన్నారు. కేరళ ప్రభుత్వం ప్రతి బడ్జెట్‌లో రోడ్డు రవాణా సంస్థకు వెయ్యి కోట్లు కేటాయిస్తోందని వారన్నారు. ఆర్టీసీలో జరుగుతున్న సమ్మెలో అన్ని యూనియన్లు సమ్మె చేస్తుంటే పోలీసులు మాత్రం డబుల్‌డ్యూటీ చేస్తున్నారన్నారు. కేసీఆర్ 80 వేల పుస్తకాలు చదివానని అంటున్నాడని, అన్ని పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రి ఏ చట్టం ప్రకారం కార్మికులను డిస్మిస్ చేశాడో చెప్పాలన్నారు. కోర్టులో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్‌లు కార్మికులు చందమామ కోరికలు అడుగుతున్నారని చెప్పడం అభ్యంతరకరమన్నారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని అడ్వకేట్లు కోర్టు దృష్టికి తీసుకెళితే మన నాయకులు మాత్రం ధనిక రాష్టమ్రని చెపుతున్నారన్నారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికులతో మైండ్ గేమ్ ప్రారంభించారని, హుజూర్‌నగర్ ఎన్నికల్లో గెలవగానే ప్రెస్‌మీట్ పెట్టాడన్నారు. ఇంతకాలం మాట్లాడని కేసీఆర్ హుజూర్‌నగర్ ఎన్నిక గెలుపుతోనే బయటకు వచ్చాడన్నారు. గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఇక ఆర్టీసీ లేదని చెప్పిన కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఆర్టీసీ సమ్మెకు ప్రజలంతా సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. 30న జరిగే సకల జనుల భేరికి అందరూ తరలిరావాలని, హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్‌రావు, వెంకట్, బందు సాయిలు, రాజ్‌కుమార్, బొట్ల చక్రపాణి, ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.

*చిత్రం...సమ్మెకు సంఘీభావం తెలుపుతున్న నేతలు