తెలంగాణ

తక్కువ ధరకే స్టెంట్ రూపొందిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు గుండె ఆపరేషన్లకోసం వాడే ‘స్టెంట్’ను తక్కువ ధరకే రూపొందించేందుకు పరిశోధన చేపడుతున్నామని హైదరాబాద్‌లోని ‘ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటల్లర్జీ అండ్ న్యూ మెటీరియల్స్ (ఏఆర్‌సీఐ) డైరెక్టర్ డాక్టర్ జీ. పద్మనాభ రెడ్డి తెలిపారు. ఏఆర్‌సీఐలో జరుగుతున్న పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు, మరీ ముఖ్యంగా యువతీ యువకులు, విద్యార్థులకు తెలియచేసేందుకు గురువారం ‘ఔట్‌రీచ్ ప్రోగ్రాం’ ఏర్పాటు చేశారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నేతృత్వంలో నడుస్తున్న ఏఆర్‌సీఐ ఆవరణలోకి సాధారణంగా ఎవరినీ అనుమతించరు. ఈ సంస్థ ఏర్పాటైన దాదాపు 20 ఏళ్ల తర్వాత ఏఆర్‌సీఐ కార్యక్రమాలను పరిశీలించేందుకు ఎంపిక చేసిన వారిని ఔట్‌రీచ్ ప్రోగ్రాం సందర్భంగా అనుమతించారు. ఈ సందర్భంగా ఏఆర్‌సీఐ డైరెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, గుండె ఆపరేషన్లలో ప్రస్తుతం వాడుతున్న ‘స్టెంట్లు’ అధిక ధర కలిగి ఉన్నాయని, అందుకే తక్కువ ధరకే నాణ్యమైన స్టెంట్లు రూపొందించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కేరళలోని శ్రీ చిత్ర తిరునాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ స్టెంట్ల పరిశోధనలో తమకు సహకరిస్తోందన్నారు. ఇలా ఉండగా బయోమెడికల్ డివైజెస్ తయారీలో కూడా ఇక నుండి పరిశోధన, అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించామన్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనాలతో పాటు కార్లకోసం ఉపయోగించే బ్యాటరీలను అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందిస్తున్నామని పద్మనాభరెడ్డి తెలిపారు. ఈ టెక్నాలజీని ఉపయోగించుకునేందుకు 12 కంపెనీలు ముందుకు వచ్చాయని, సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయన్నారు. ఏఆర్‌సీఐ అటానమస్ సంస్థ కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు స్వంతంగా నిధులు సమకూర్చుకుంటోందన్నారు. ఏఆర్‌సీఐ ఇప్పటి వరకు ఇంజనీరింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, నానోమెటీరియల్స్, ఎనర్జీ మెటిరీయల్స్‌కు సంబంధించి దాదాపు 20 సాంకేతిక అంశాలపై చేసిన పరిశోధనా ఫలితాలను 36 పరిశ్రమలకు బదిలీ చేసినట్టు పద్మనాభం వివరించారు. నానోమెటీరియల్స్, ఆటోమోటివ్ ఎనర్జీ మెటీరియల్స్, సోలార్ ఎనర్జీ మెటీరియల్స్, సిరామిక్ ప్రాసెసింగ్, ఇంజనీర్డ్ కోటింగ్, లేజర్ మెటరీయల్ ప్రాసెసింగ్, ఫ్యూయల్ సెల్స్, సోల్-జెల్ కోటింగ్ తదితర విభాగాలలో పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ‘మేక్ ఇన్ ఇండియా’ పిలుపును దృష్టిలో ఉంచుకుని నాణ్యమైన వస్తువులను తక్కువ ధరకే తయారు చేసే అంశంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నామన్నారు.
విద్యార్థులకు అవకాశం
ఏఆర్‌సీఐలో పరిశోధనల్లో భాగస్వామ్యం అయ్యేందుకు బీటెక్, ఎంటెక్, ఎమ్మెస్సీ, ఇంజనీరింగ్ డిప్లొమా చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఇస్తున్నామని పద్మనాభం వివరించారు. ఏటా దాదాపు 40 మంది రీసెర్చ్ ఫెల్లోషిప్ ప్రోగ్రాంలో అవకాశం ఇస్తున్నామన్నారు. ఐఐటీ, ఎన్‌ఐటీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తదితర విద్యాసంస్థల నుండి వచ్చిన విద్యార్థుల్లో 60 మంది పీహెచ్‌డీ, 30 మంది మెటీరియల్ థిసీస్‌లో ఉన్నారన్నారు. బీటెక్ చదువుతున్న వారు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్ చేసేందుకు కూడా అవకాశం ఇస్తున్నామన్నారు.
సమావేశంలో అసోసియేట్ డైరెక్టర్లు డాక్టర్ టీఎన్ రావు, డాక్టర్ రాయ్ జాన్సన్ కూడా ఉన్నారు.