తెలంగాణ

కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రా? సీఈవోనా!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: న్యాయసమ్మతమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిన తీరు దారుణంగా ఉందని బీజేపీ ధ్వజమెత్తింది. సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యంలో ఎన్నికైన ముఖ్యమంత్రి కంటే, ఒక ప్రైవేట్ సంస్థకు సీఈవోలాగా వ్యవహరించారు. ఆర్టీసీపై చేసిన ప్రపకటన నయా పెట్టుబడీనదారీ మనస్తత్వాన్ని ప్రతిబింబించాయని బీజేపీ పేర్కొంది. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ పాత్రను తక్కువగా చూపిస్తున్నారని ఆ పార్టీ తెలిపింది. ఆర్టీసీ ప్రజా రవాణా కోసం తెలంగాణలో మారుమూల గ్రామాలు, పట్టణాలకు అనుసంధానించడానికి ఒక సంక్షేమ ప్రయత్నం చేయాలని బీజేపీ పేర్కొంది. ఇంత పెద్ద సంస్థకు పూర్తిసమయం ఎదండీ, చైర్మన్‌ను నియమించకుండా తన ప్రభుత్వ బాధ్యతను విస్మరించారన్నారు. తన పెంపుడు ప్రైవేట్ సంస్తలకు పూర్తిగా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఆర్టీసీకి ఇచ్చిన గ్రాంట్లు, కేటాయించిన నిధులు, ప్రస్తుత ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులపై కేసీఆర్ వెంటనే శే్వతపత్రం విడుదల చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. కేసీఆర్ ప్రకటనలకు విశ్వసనీయత లేదని ఆ పార్టీ విమర్శించింది.