తెలంగాణ

రబీ ఎరువుల సరఫరాపై ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: తెలంగాణలో రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు అవసరమైన ఎరువులను మరీ ముఖ్యంగా యూరియాను అందించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాల్సి ఉందని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ, విశాఖపట్నం, కృష్ణపట్నం, గంగవరం పోర్టుల నుండి రైళ్లద్వారా ఎరువులను తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేసే అంశంపై చర్చించేందుకు గురువారం రైల్వేశాఖ ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. రబీలో ఎరువులకు డిమాండ్ బాగా ఉంటుందని, అక్టోబర్, నవంబర్ నెలల్లో అవసరమైన బఫర్ స్టాకును పెంచుకోవాలన్నారు. అక్టోబర్ నెలలో కేటాయించిన 1.50 లక్షల టన్నుల యూరియాను రైతులకు సకాలంలో పంపిణీ చేసేందుకు రైల్వే రేకులను అందుబాటులో ఉంచాలన్నారు. రేక్ పాయింట్లను కూడా పెంచాల్సి ఉందన్నారు.
సనత్‌నగర్, పెద్దపల్లి గూడ్స్‌షెడ్లపై వత్తిడి తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా తాండూరు, మంథని, నాగులపల్లి, హసన్‌పర్తి రైల్వే గూడ్స్‌షెడ్లను వినియోగించుకోవాలని సీఎఫ్‌టీఎం నాగ్యా నాయక్ సూచించారు.
ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా, పీసీఓఎం కే. శివప్రసాద్, పీసీసీఎం జి. జాన్ ప్రసాద్, రైల్వే బోర్డ్ ఈడీ మనోజ్ శ్రీవాస్తవ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... రైల్వేశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతున్న పార్థసారథి