తెలంగాణ

కార్మికులను చులకనగా చూడొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 24: ప్రజా రవాణా వ్యవస్థలో వెనె్నముకగా ఉన్న ఆర్టీసీ కార్మిక శక్తులకు ముగింపు ఉండదని జేఏసీ నేతలు మండిపడ్డారు. కార్మికులను చులకనగా సీఎం కేసీఆర్ మాట్లాడడం బాధాకరమని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా నిరసనలు, ధర్నాలు, ర్యాలీలను కొనసాగిస్తామన్నారు. గురువారం హైదరాబాద్‌లో జేఏసీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ జేఏసీలో చీలికలు తీసుకువచ్చి సమ్మెను విచ్ఛిన్నం చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ సన్నాహాలు చేయడం దుర్మార్గం అన్నారు. కార్మిక సంఘాలు వేరు కార్మికులు వేరు అన్న భావన సీఎం కేసీఆర్ సృష్టేనని ఆయన ధ్వజమెత్తారు. ఒకరిని పొగుడుతూ మరొకరిని విమర్శించడం కేసీఆర్ నైజమన్నారు. కార్మిక సంఘాల నేతలపై కేసీఆర్ చేసిన వ్యాఖలపై ఆయా సంఘాల నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్మిక సంఘాల నేతలకు ముగింపు ఉందని, వారి విష వలయంలో కార్మికులు పడవద్దని పిలుపు ఇవ్వడం కేసీఆర్ దురహంకారానికి నిదర్శనమన్నారు. ప్రజా స్వామ్యంలో నియంతలు, నిరంకుశ పాలకులకు ప్రజలే ముగింపు పలుకుతారని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ వ్యాఖ్యలకు కార్మికులు భయపడవద్దని, ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని ఆయన హితవు పలికారు. ఆర్టీసీ కేసీఆర్ జాగీరు కాదన్నారు. ఆర్టీసీలో పనిచేస్తున్న 50వేల మంది కార్మికులను అవమానించే విధంగా కేసీఆర్ మాట్లాడడం శోచనీయం అన్నారు. కేసీఆర్ సమ్మెపై చేస్తున్న వ్యాఖ్యలకు ఇప్పటి వరకు 11 మంది కార్మికులు అత్మబలిదానం చేసుకోవడం జరిగిందన్నారు. ఆర్టీసీ కార్మికుల తమ న్యాయమైన కోర్కెలను సీఎం గొంతెమ్మ కోర్కెలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ ఫాంహౌజ్ పాలేర్లు కాదన్నారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఈనెల 30న హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరపతలపెట్టిన సకలజనుల సమరభేరికి రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా కార్మికులు కదలిరావాలన్నారు. కార్మికుల శక్తి ఏమిటో సీఎంకు తెలిసి వచ్చే విధంగా కార్మిక కుటుంబాలు సైతం సభలో పాల్గొనాలన్నారు.