తెలంగాణ

త్వరలో మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలకు సంబంధించి మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా ఎన్నికలల జాబితాను ఈ ఏడాది జూలై 16వ తేదీన ప్రచురించామని పేర్కొంది. అసెంబ్లీ ఓటర్ల జాబితాను కొలమానంగా వార్డుల వారీగా ఎన్నికల జాబితాను మున్సిపల్ కమిషనర్లు సిద్ధం చేశారని తెలిపింది. మున్సిపల్ వార్డుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదా తెలుసుకోవాలని ఎన్నికల సంఘం ఓటర్లను కోరింది. మున్సిపల్ వార్డుల ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నవారే ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు అర్హులని పేర్కొంది. అయితే, అసెంబ్లీ ఎన్నికల జాబితాలో ఓటు వేసినంత మాత్రాన, ఓటరుగా గుర్తింపుకార్డు ఉన్నంత మాత్రాన మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హతగా భావించరాదని స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికల నిమిత్తం వార్డుల వారీగా తయారు చేసిన ఓటర్ల జాబితాలో పేర్లు నమోదై ఉండాలని పేర్కొంది. తెలంగాణ ఎన్నికల సంఘం కమిషన్ వెబ్ పోర్టల్‌లోకి వెళ్లి ఓటరు స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించింది. అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో పేరు ఉంటే ఆటోమేటిక్‌గా మున్సిపల్ వార్డుల వారీగా రూపొందించిన ఓటర్ల జాబితాలో పేరు ఉంటుందన్నారు. కానీ దీని నిమిత్తం ముందుగా అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ల జాబితాను తనిఖీ చేసుకోవాలని ఎన్నికల సంఘం కోరింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ పేరును తనిఖీ చేసుకోవాలని ఎన్నికల సంఘం కోరింది. ఒకవేళ అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరున్నా మున్సిపల్ వార్డుల జాబితాలో పేరు లేనిపక్షంలో ఓటరుగా తమ పేరును ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడు అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది. ఎన్నికల నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తున్న నేపథ్యంలో ఓటర్లు చివరి నిమిషంలో తమ పేరు మున్సిపల్ ఓటర్ల జాబితాలో లేదని నిరాశకు గురికాకుండా ముందస్తుగా జాగ్రత్తపడాలని ఎన్నికల సంఘం కోరింది.