తెలంగాణ

సమన్వయంతో పనిచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్రంలో గ్రామీం ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో విష జ్వరాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌కే జోషీ ఆదేశింరు. శుక్రవారం ఇక్కడ ఆయన బీఆర్‌కే భవన్‌లో కీటక జనిత వ్యాధులపై ప్రత్యేక సమీక్ష నిర్వహింరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ, చికన్ గున్యా, ఫైలేరియా, జపానీస్ ఎన్ సెఫలైటిస్ లాంటి వ్యాధులపై చర్చించేందుకు కేంద్రం నుండి వెంటనే ప్రత్యేక బృందం వచ్చిందన్నారు. ఈ వ్యాధుల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలతోపాటు జ్వరాలు వచ్చిన చోట వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. జ్వరాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. దోమల బ్రీడింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనల ప్రకారం నివారణ చేపట్టాలన్నారు. దీని కోసం సరైన పరికరాలను వినియోగించాలన్నారు. ఫాగింగ్‌ను సరైన పద్ధతిలో చేపట్టి ప్రజలకు తెలియచేయాలన్నారు. ఈ వ్యాధుల నివారణ, వ్యాప్తి, వైద్య పరీక్షలు, అందుతున్న వైద్య సేవలపై ఆయన వైద్యాధికారులతో విస్తృతంగా చర్చించారన్నారు. జిల్లాల్లో వైద్య సిబ్బంది ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వైద్య విధాన పరిషత్ కమిషనర్ యాగితా రాణా, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు , కేంద్రప్రభుత్వానికి సంబంధించిన నేషనల్ వెక్టర్ బార్న్ విష జ్వరాల నివారణ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి సుమన్ లతా పటేల్, కనె్సల్టెంట్ కౌశల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.