తెలంగాణ

కేసీఆర్.. మితిమీరకండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ సమ్మెపై మితిమీరిన మాటలు మాట్లాడారని, ప్రజాస్వామ్యంలో నియంతృత్వానికి తావులేదని సీఎల్‌పీ నేత భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి వచ్చే కార్మిక సమస్యలను పనికిమాలిన పనులు అనడం సమంజసం కాదన్నారు. చర్చలకు పిలవాల్సిన వ్యక్తే నోటికి వచ్చినట్లు మాట్లాడడం అహంభావానికి నిదర్శనమన్నారు. కేసీఆర్ ఫ్వూడల్ మనస్తత్వానికి పరాకాష్ట అన్నారు. చర్చలకు పిలిచే ధోరణితో సీఎం లేరా అని ప్రశ్నించారు. కోర్టులను గౌరవించే సంస్కారం నేర్చుకోవాలన్నారు. ఆర్టీసీ పని అయిపోయిందని సీఎం వ్యాఖ్యానించడం సరికాదన్నారు. దశాబ్థాలుగా ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన ఆస్తి ఆర్టీసీ అన్నారు. ఒక్క హుజూర్‌నగర్ విజయంతో సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి అవగాహన లేని సీఎం ఉండడం బాధ కలిగిస్తోందన్నారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఆదేశాల నివేదికను సీఎం చదువుకుంటే మంచిదన్నారు. సమ్మెకు నోటీసు ఇస్తే పనికి మాలిన కోరికలతో సమ్మెకు పోతారా అని సీఎం అవహేళన చేయడమేంటన్నారు. ఆర్టీసీకి ఇదే ముగింపు అని మాట్లాడిన సీఎంను హెచ్చరిస్తున్నామన్నారు. ఆర్టీసీ పెట్టింది కేసీఆర్ కాదన్నారు. ఆర్టీసీ అప్పుల్లో ఉందని అమ్మేస్తున్నామని కేసీఆర్ అంటున్నారని, రాష్ట్రప్రభుత్వం కూడా రూ. 3లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అమ్మేస్తారా అని నిలదీశారు. ఆర్టీసీ ఆస్తులను అమ్మకానికి పెట్టి భవిష్యత్తు తరాలకు ప్రభుత్వ రవాణా లేకుండా చేస్తామంటే ఊరుకునేది లేదన్నారు. ఆర్టీసీ ఆస్తులను ఒకరిద్దరికి కట్టపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇలా చేస్తూ పోతే అసమానతలు ఇంకా పెరుగుతాయన్నారు. ఆస్తులు తాకట్టుపెట్టుకుంటూ పోతే రాష్ట్రం తాకట్టులో ఆస్తులు ఉంటాయన్నారు.
న్యాయస్థానాలంటే లెక్కలేదా అన్నారు. కార్మికులను మనుషులుగా గుర్తించాలన్నారు. తెలంగాణ సమాజం ఇప్పటికైనా మేల్కొనాలన్నారు. పార్టీ నేతలతో మాట్లాడి ఆర్టీసీ సమస్యలపై పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తే ఇంకా అసమానతలు పెరుగుతాయన్నారు. రాష్ట్రంలో డెంగ్యూ జ్వరాలపై కోర్టులు మొత్తుకున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.