తెలంగాణ

జోక్యం చేసుకోండి... పరిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 25: రాష్ట్రంలో జరుగుతున్న ఆర్టీసీ సమ్మెను పరిష్కరించమని ప్రభుత్వాన్ని ఆదేశించేలా జోక్యం చేసుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను ట్రేడ్ యూనియన్ల సంఘాల నేతలు శుక్రవారం నాడు కోరారు. ఐఎన్‌టీయూసీ నేత విజయకుమార్, ఎఐటీయూసీ నేత బీ వెంకటేష్, సీఐటీయూ నేత ఎం సాయిబాబు, ఐఎఫ్‌టీయూ నేత కే సూర్యం, టీఎన్‌టీయూసీ నేత ఎంకే బోస్, ఐఎఫ్‌టీయూ నేత ఎం శ్రీనివాస్‌లు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు గవర్నర్‌కు ఒక వినతిపత్రాన్ని సమర్పించారు. సుమారు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొన్నారని, అక్టోబర్ 5వ తేదీ నుండి వారు సమ్మె చేస్తుంటే ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను సైతం పరిష్కరించకుండా తిరిగి కార్మికులను బెదిరిస్తోందని పేర్కొన్నారు. ఆర్టీసీని కాపాడుకునేందుకే కార్మికులు అనేక డిమాండ్లను పెట్టారని, ప్రభుత్వం బాకీ పడిన నిధులను విడుదల చేయాలని కోరుతున్నారని, జీఎస్‌టీ, ఇతరపన్నుల రూపంలో ఆర్టీసీ ఎంతో చెల్లిస్తోందని, పన్నుల భారం వల్ల కూడా ఆర్టీసీ కోలుకోలేకపోతోందని వారు వివరించారు. ఆర్టీసీ కేంద్ర, రాష్ట్ర పన్నులుగా 3940 కోట్లు చెల్లిస్తోందని, ఇది ఆదాయంలో దాదాపు 21 శాతం ఉందని పేర్కొన్నారు. దీనికి తోడు మరో 4వేల ప్రైవేటు బస్సులకు అనుమతి ఇచ్చిందని వారు చెప్పారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం వల్ల కార్మికులకు , సంస్థకూ భద్రత ఏర్పడుతుందని వారు చెదప్పారు. ధరలు ఆకాశానికి అంటుతున్న ప్రస్తుత తరుణంలో వేతనాలు పెంచమని కోరడంలో ఎలాంటి తప్పులేదని వారు వివరించారు. గతంలో యూనియన్లు ఎవరికి వారు ఈ అంశాలపై సంస్థను కోరారని, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదని స్పష్టం చేశారు.