తెలంగాణ

ఐక్యంగా పోరాడితే కేసీఆరే దిగొస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట రూరల్, అక్టోబర్ 25: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వానికి ఏమి నష్టమో చెప్పకుండా ఆర్టీసీని ప్రయివేటు పరం చేయడానికి కుయుక్తులు పన్నుతూ కార్మికుల మధ్య విభేదాలు సృష్టిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపులకు పాల్పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటం చేయడం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని, కేసీఆరే దిగివస్తాడని తెలిపారు. శుక్రవారం యాదగిరిగుట్టలో ఆర్టీసీ కార్మికులు 21 రోజులుగా చేస్తున్న సమ్మెకు మద్దతుగా యాదగిరిగుట్ట డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మికులను అణగదొక్కాలని చూసిన ప్రతి ఒక్కరూ కాలగర్భంలో కలసిపోయారని, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్మికులను, కోర్టులను, రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని నియంతలా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడని, ఆర్టీసీ ఏమైనా ఆయన జాగీరా అన్నారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు కుట్ర పన్నుతున్నారని, ఆర్‌టీసీని ప్రయివేటు పరంచేయాలని కుట్రలు పన్నుతూ కార్మికుల మద్య విభేదాలు సృష్టిస్తున్నాడని, కార్మికులు ఐక్యంగా ఉండి పోరాటం చేస్తే కేసీఆర్‌కు భంగపాటు తప్పదన్నారు. ఎవరి బెదిరింపులకు ఆర్టీసీ కార్మికులు భయపడవద్దని మీకు వామపక్షాలు, అఖిలపక్ష నాయకులతో పాటు ప్రజలు అండగా ఉన్నారని అన్నారు. ఈనెల 30న సకల జనుల సమ్మెతో ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు దసరా, దీపావళి పండుగలు చేసుకోకుండా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. హుజూర్‌నగర్ ఎన్నికలకు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధం లేదని, ఒక ముఖ్యమంత్రి కార్మికులపై ఇంత చిన్న చూపు చూడడం హేయమైన చర్య అన్నారు. సీపీఐ ఎమ్‌ఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమ మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాల రాస్తున్న ముఖ్యమంత్రికి గుణపాఠం తప్పదని, హైకోర్టును, రాజ్యాంగాన్ని, చట్టాలను దేనినీ లెక్క చేయకుండా ఘోరంగా నియంతలా మాట్లాడుతున్నాడని విమర్శించారు.