తెలంగాణ

శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద ప్రవాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 25: శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు కొనసాగుతోంది. మహరాష్ట్ర, కర్నాటకలలో భారీ వర్షాలు కురవడంతో రికార్డు స్థాయిలో వరదనీరు వస్తోంది.
దీంతో శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి శ్రీశైలం ప్రాజెక్టు 10 వరదగేట్లను 20 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జునసాగర్‌కు 4.73 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంత ప్రాజెక్టులైన జూరాల ప్రాజెక్టు వరద గేట్ల నుంచి 2,35,465 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రం నుంచి 24.551 క్యూక్కులు, సుంకేసుల డ్యాం నుంచి 51,383 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 250 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం నుంచి కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 25,634 క్యూసెక్కులు, భూగర్భ విద్యుత్ కేంద్రం నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 42,378 క్యూసెక్కులు, డ్యాం 10 వరదగేట్లను 20 అడుగుల మేర ఎత్తి 4.73లక్షల క్యూసెక్కులు మొత్తం 5,40,987 క్యూసెక్కుల నీటిని దిగువన నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి శ్రీశైలం జలాశయం గరిష్ట నీటి మట్టం 885 అడుగులకుగాను 884.30 అడుగులుగా, గరిష్ట నీటిమట్టం 215.807 టీఎంసీలకు గాను 211.4759 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు వరద గేట్లను ఎత్తడంతో డ్యాం వద్ద పర్యాటకులరద్దీ కూడా బాగా పెరిగింది.