తెలంగాణ

‘చర్చల వైఫల్యానికి ప్రభుత్వమే కారణం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 26: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించి అర్ధాంతరంగా చర్చలు ముగియడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వామపక్ష నేతలు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. హైకోర్టు స్ఫూర్తిని తుంగలో తొక్కారని, సమస్యను జటిలం చేశారలని, సమస్యను పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వానికి కనిపించడంలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. చర్చలకు పిలిచి, నిర్బంధాలు పెట్టి ఆర్టీసీ నాయకులను అవమానించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ సమస్యపై హైకోర్టు ఇచ్చిన సానుకూల ఆదేశాలను వక్రీకరించి, కోర్టు ఆదేశాల స్ఫూర్తిని ధిక్కరించి, శనివారం నాడు జరిగిన చర్చలను రాష్ట్ర ప్రభుత్వం విఫలం చేసిందని తమ్మినేని ఆరోపించారు. ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ జేఏసీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో చర్చలు జరుపుకోవాలని హైకోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నా 21 అంశాలపైనే అధికారులు పట్టుబట్టడంతో చర్చలు విఫలం అయ్యాయని, చర్చలుజరిగిన ఎర్రమంజిల్ ప్రాంగణం ప్రారంభంలోనే బారికేడ్లు పెట్టి యూనియన్ నాయకులను అణువణువూ స్కాన్ చేసినట్టు పరీక్షించి, సెల్‌ఫోన్లను తీసుకుని తీవ్ర అవమానానికి గురిచేయడం చూస్తుంటే 50 వేల మంది కార్మికులను అవమానపర్చడమేనని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా అధికారులు దీనికి ఒడిగట్టారని, అయినా ఆర్టీసీ జేఏసీ నాయకత్వం సహనంతో వ్యవహరించి , తిరిగి చర్చలకు ఎప్పుడు పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పడం ఆహ్వానించదగిందని అన్నారు. కోర్టుకు సమాధానం చెప్పడానికే చర్చలు చేశారే తప్ప సమస్య పరిష్కారానికి కాదని, ఆర్టీసీని లేకుండా చేస్తానన్న ముఖ్యమంత్రి ప్రకటనను అమలుచేయడానికే చర్చలు విఫలం చేశారని అన్నారు. అహంకారంతో ఆర్టీసీ సమ్మెను ఉక్కుపాదంతో అణచివేసే ధోరణిలో ఎలాంటి మార్పు లేదన్నది శనివారం నాడు జరిగిన చర్చలు మరోసారి రుజువు చేశాయని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ ధిక్కారానికి పాల్పడటం మానుకుని, తిరిగి చర్చలు జరపాలని సీపీఎం డిమాండ్ చేసింది.