తెలంగాణ

ఫిబ్రవరిలో యాదాద్రి ప్రధానాలయం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో యాదాద్రి ప్రధాన ఆలయానికి ప్రారంభోత్సవం చేయనున్నట్టు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆ సందర్భంగా యాదాద్రిలో 1,008 కుండలతో మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్టు వెల్లడించారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతలోని త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో స్వామి వారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన తిరునక్షత్ర వేడుకలకు సీఎం కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యాదాద్రి ప్రధాన ఆలయ నిర్మాణం దాదాపు పూర్తికావచ్చిందన్నారు. ఫిబ్రవరిలో ప్రధాన ఆలయాన్ని ప్రారంభించాలని సంకల్పించినట్టు ఆయన చెప్పారు. ఆ సందర్భంగా చినజీయర్ స్వామి నేతృత్వంలో అత్యంత వైభవోపేతంగా ప్రారంభోత్సవం, అలాగే మహా సుదర్శన యాగం నిర్వహిస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాధిపతులను ఆహ్వానిస్తామన్నారు. అవసరమైతే ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి పీఠాధిపతులను రప్పిస్తామన్నారు. భగవంతుడిని పూజించే సంస్కారం తనకు తల్లిదండ్రుల నుంచే వచ్చిందన్నారు. తనకు 14వ ఏటనే వరంగల్ జిల్లా చిత్తలూరులో వివాహం జరిగిందన్నారు. ఆ రోజుల్లో గ్రామానికి గురువులు వస్తే పండుగలా జరుపుకునే వారన్నారు. ఆ సందర్భంగా గురువులు భారతం, భాగవతంలోని విశేషాలను చెప్పేవారన్నారు. తమలో భక్త్భివం, సంస్కారం అప్పటినుంచే తమకు అబ్బడంతో ఆ భక్తి పరంపర కొనసాగుతోందన్నారు. భక్త్భివన ఉన్నప్పటికీ అది పరిపుష్టంగా జరగాలంటే ఎక్కడో ఒకచోట ప్రజల్వన జరగాల్సి ఉంటుందన్నారు. ఈ సందర్భంగా చినజీయర్ స్వామితో తనకు ఏర్పడిన అనుబంధాన్ని సీఎం వివరించారు. తాను 1986లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వికాస తరంగిణి వారు సిద్దిపేటలో బ్రహ్మయజ్ఞం తలపెట్టారని, ఆ కార్యక్రమానికి జీయర్ స్వామి వస్తున్నారని, దానికి తన సహకారం కావాలని నిర్వాహకులు కోరారని చెప్పారు. స్వామి ఎక్కడ బస చేయనున్నారని ప్రశ్నించగా అందుకు మీ ఇల్లే సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పడంతో అంతకన్నా అదృష్టం ఏముంటుందని సంతోషించానన్నారు. ఆ సందర్భంగా ఏడు రోజుల పాటు జీయర్ స్వామి తమ ఇంట్లోనే ఉండటంతో తానే స్వయంగా కారు డ్రైవ్ చేస్తూ చుట్టుపక్కల ఆలయాలను
సందర్శించినట్టు చెప్పారు. ఆ సందర్భంగా జీయర్ స్వామి అనుగ్రహ భాషణలు తనను ఎంతగానో ఆకట్టుకోవడంతో అప్పటినుంచి భక్తునిగా మారినట్టు సీఎం కేసీఆర్ వివరించారు. జీయర్ స్వామి ఆశ్రయ ప్రాంగణంలో నెలకొల్పిన అతి భారీ రామానుజాచార్య విగ్రహం హైదరాబాద్‌కే గర్వకారణంగా మారబోతుందన్నారు. విదేశస్తులు కొందరు తనను కలిసిన సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని భారీ విగ్రహం గురించి ఆసక్తిగా అడుగుతున్నారన్నారు. భగవత్ రామానుజాచార్యుల విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం కూడా భారీగా నిర్వహించాలని, ఆ కార్యక్రమంలో తాను కూడా ఓ సేవకుడిలా పాలుపంచుకుంటానని సీఎం కేసీఆర్ అన్నారు. చినజీయర్ స్వామి ప్రసంగిస్తూ దైవ కార్యక్రమాలను నిర్వహించడానికి రాజకీయ నాయకులు చాలామటుకు భయపడతారని, పాల్గొనడానికి సిగ్గుపడతారని, మొహమాటపడతారన్నారు. అయితే వీటికి సీఎం కేసీఆర్ అతీతుడన్నారు. ధార్మిక, భక్తి కార్యక్రమాలను నిర్భయంగా నిర్వహిస్తూ సీఎం కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని జీయర్ స్వామి కొనియాడారు. కేసీఆర్ హయాంలో యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ ఆలయాల అభివృద్ధి జరుగుతుందన్నారు. దేశంలోనే అతి పెద్ద నరసింహస్వామి ఆలయంగా యాద్రాద్రి మెగా ప్రాజెక్టుగా తీర్చిదిద్దుకుంటుందని ప్రశంసించారు. ఈ సందర్భంగా పెద్ద జీయర్ స్వామి రచించిన ‘సత్య సంకల్పం’ పుస్తకాన్ని జీయర్ స్వామి సీఎం కేసీఆర్‌కు బహూకరించారు.

*చిత్రం... శంషాబాద్‌లోని ముచ్చింతలలో గల త్రిదండి చినజీయర్ స్వామి ఆశ్రమంలో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సత్కరిస్తున్న చినజీయర్ స్వామి