తెలంగాణ

శ్రీశైలం ప్రాజెక్టుకు తగ్గిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలంప్రాజెక్టు, అక్టోబర్ 28: జూరాల, సుంకేసుల డ్యాం నుంచి వస్తున్న వరదనీరు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాంలో సోమవారం ఉదయం నుంచి రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి జూరాల ప్రాజెక్టు వరదగేట్ల నుంచి 77,467 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రం ద్వారా 32,521 క్యూసెక్కులు, సుంకేసుల డ్యాం ద్వారా 61,306 క్యూసెక్కులు, హంద్రీనది నుంచి 500 క్యూసెక్కుల నీరు మొత్తం లక్షా 71,794 క్యూసెక్కులు నీరు శ్రీశైలం జలాశయంకు వస్తున్నది. ప్రాజెక్టు కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా ఏడు జనరేటర్లు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 26,634 క్యూసెక్కులు, భూగర్భ విద్యుత్ కేంద్రం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 42,378 క్యూసెక్కులు, డ్యాం వరద గేట్లను పది అడుగులమేర ఎత్తి 55,874 క్యూసెక్కులు మొత్తం లక్షా 24, 886 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాటు రెగ్యులేటర్ ద్వారా 20వేల క్యూసెక్కులు, హంద్రీనీవా ఎత్తిపొతల ద్వారా 2020 క్యూసెక్కులు, కేఎల్‌ఐ ఎత్తిపోతల ద్వారా 1600 క్యూసెక్కులు మొత్తం 23,620 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సోమవారం సాయంత్రం ఆరుగంటల సమయానికి ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులకుగాను 884.70 అడుగులు, గరిష్ట నీటి నిలువ 215.8 టీఎంసీలకుగాను 213.882 టీఎంసీలుగా నమోదై ఉంది.

*చిత్రం... శ్రీశైలం ప్రాజెక్టు