తెలంగాణ

దాగుడుమూతలు వద్దు..కార్మికులతో చర్చలు జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం పంతాలకు పోకుండా ఇప్పటికైనా చొరవ తీసుకుని సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా పలు ప్రజాసంఘాలు , విద్యార్థి సంఘాల నేతలు , యువజన సంఘాలు కోరాయి. హైకోర్టు ముందు వాస్తవాలను వివరించాలని, ఆర్టీసీకి ప్రభుత్వ పరమైన బకాయిలు తీర్చాలని, బేషరతుగా కార్మికుల డిమాండ్లను అంగీకరించాలని వారు కోరారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సామాన్యులకు ఎంతో ఇబ్బంది ఎదురవుతోందని, సామాన్యులు నగరాల్లోని ఆస్పత్రులకు చికిత్సలకు కూడా రాలేకపోతున్నారని, త్వరితగతిన ఆర్టీసీ సమ్మెకు పరిష్కారం చూపాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కాకపోవడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వామపక్ష నేతలు పేర్కొన్నారు. హైకోర్టు సూచించినా, సమస్యను పరిష్కరించే చిత్తశుద్ధి ప్రభుత్వం చూపించడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. చర్చలకు పిలిచి, నిర్బంధాలు పెట్టి ఆర్టీసీ నాయకులను అవమానించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ సమస్యపై హైకోర్టు ఇచ్చిన సానుకూల ఆదేశాలను వక్రీకరించారని తమ్మినేని ఆరోపించారు. ఆర్టీసీ యాజమాన్యం, ఆర్టీసీ జేఏసీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో చర్చలు జరుపుకోవాలని హైకోర్టు ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నా 21 అంశాలపైనే అధికారులు పట్టుబట్టడం సరికాదని పేర్కొన్నారు.