తెలంగాణ

కూనంనేని అరెస్టు.. నిమ్స్‌కు తరలింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిరాహార దీక్ష ప్రారంభించిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావును ఆదివారం అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిమ్స్‌లో తాను నిరాహార దీక్షను కొనసాగిస్తున్నట్టు కూనంనేని ప్రకటించారు. కూనంనేని అక్రమ అరెస్టును నిరసిస్తూ, ఎఐవైఎఫ్, ఎఐఎస్‌ఎఫ్ విద్యార్థులు నిరసన వ్యక్తం చేయగా వారిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరుపై వామపక్ష నేతలు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అన్ని ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు ముందుకు వచ్చి నిరసనలు ఉద్ధృతం చేయాలని, అక్టోబర్ 30న జరిగే సకల జనుల సమరభేరి సభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. సీపీఐ కార్యాలయంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని 24 రోజులుగా సమ్మె చేస్తుంటే కార్మికుల న్యాయబద్ధ సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉండగా, అణచివేసేలా సీఎం వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు అరెస్టును ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలీ ఉల్లా ఖాద్రీ , ఎఐటీయూసీ నేత ప్రేం పావనీ, ఎఐటీయూసీ నేత ఎం నర్సింహ, భిక్షపతి యాదవ్, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం అర్ధరాత్రి సీపీఐ కార్యాలయంలోని దీక్షా శిబిరంపై దాడి చేసి భగ్నం చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. సమ్మె పరిష్కరించాల్సిన ప్రభుత్వం రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతోందని, న్యాయస్థానాలంటే కేసీఆర్‌కు నమ్మకం లేదని తేటతెల్లం అవుతోందని అన్నారు. ప్రభుత్వం పరిష్కార దిశగా ప్రయత్నాలు ప్రారంభించాలని కోరారు. వేరొక ప్రకటనలో ఎఐటియుసీ ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండీ యూసుఫ్, రాష్ట్ర నేతలు ఉజ్జిని రత్నాకర్‌రావు, కార్యదర్శి ఎన్ కరుణకుమారి, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ బాబు, కే రాజిరెడ్డిలు సంఘీభావాన్ని ప్రకటించారు.
*చిత్రాలు.. హైదరాబాద్‌లో సోమవారం ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఆందోళన చేస్తున్న అఖిల పక్ష నేతలు
*నిమ్స్‌లో దీక్ష చేస్తున్న కూనంనేని