తెలంగాణ

అంతిమ లక్ష్యం న్యాయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 28: పోలీసులు, న్యాయవ్యవస్థ ఒకే నాణానికి రెండు పార్శ్వాలని, ఇరువురి లక్ష్యం చివరికి న్యాయం చేయడమేనని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్ అన్నారు. రాజ్‌బహదూర్ వెంకట్రామ్‌రెడ్డి పోలీసు అకాడమీలో జరిగిన 2019-20 ఎస్‌సీటీ ఎస్‌ఐ (సివిల్) ప్రవేశ శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి శిబిరాన్ని ప్రారంభించి ప్రసంగించారు. మీరంతా యువత, మీరే భవిత అని సీజీ పేర్కొన్నారు. అకాడమీ గురుకుల్ లాంటిదని, రియాక్టివ్ కాకుండా ప్రోయాక్టివ్ పోలీసింగ్ ముఖ్యమన్నారు. పోలీసు అధికారి విధి పట్ల భక్తి, అంకితభావం, పరిపూర్ణత ఉండాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు శాఖలో ఎస్‌ఐలుగా ఎంపికై శిక్షణ శిబిరంలో పాల్గొన్న వారిని అభినందించారు. నేరస్థుడిని నేరానికి అనుసంధానించడం ద్వారా పరిశోధనలో శాస్ర్తియ ఆప్టిట్యూడ్, ప్రోయాక్టివ్ పోలీసింగ్, సాక్ష్యం ఆధారిత పోలీసింగ్, పౌరుల రాజ్యాంగ చట్టపరమైన హక్కులను సమర్థించడం పోలీసుల ఇమేజ్‌ను మరింత పెంచుతుందని డీజీపీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థలో అనేక మార్పులు తెచ్చామని ప్రతి ఒక్కరు చట్టాన్ని పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వినయ్ కుమార్ సింగ్, శిక్షణ శిబిరం కోర్స్ డైరెక్టర్, అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బీ. నవీన్ కుమార్ , జానకి శర్మిల తదితరులు పాల్గొన్నారు.
*చిత్రాలు.. పోలీస్ అకాడమీలో జరిగిన సివిల్ ఎస్‌ఐల శిక్షణ శిబిరం ప్రారంభోత్సవంలో
ప్రసంగిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహాన్