తెలంగాణ

సమ్మె ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించేంత వరకూ సమ్మె ఆగే ప్రసక్తే లేదని ఆర్టీసీ సంయుక్త కార్యాచరణ కమిటీ (జేఏసీ) స్పష్టం చేసింది. సర్కారు దిగివచ్చే వరకూ పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది. ‘ఆర్టీసీ పరిరక్షణ’ పేరుతో బుధవారం సరూర్‌నగర్ స్టేడియం లో జరిగిన ‘సకలజన భేరి’ సభ విజయవంతం అయింది. జేఏసీ నేతలు ఊహించిన దానికంటే ఎక్కువ మంది ఈ సభకు హాజరయ్యారు. హైకోర్టు సభను నిర్వహంచేందుకు ఆలస్యంగా, మంగళవారం అనుమతి ఇచ్చినా సుదూర ప్రాంతాల నుండి కూడా కార్మికులు తరలి రావడం విశేషం. తొలుత సరూర్‌నగర్ స్టేడియం ఆరుబయట సభ నిర్వహించాలని భావించారు. ఇండోర్ స్టేడియంలో జరుపుకొనేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. వివిధ జిల్లాల నుండి వచ్చిన కార్మికులతో ఇండోర్ స్టేడియం నిండిపోగా, చాలా మంది స్టేడియం వెలుపలే ఉండిపోవాల్సి వచ్చింది. సేడియం వెలుపల దాదాపు అర కిలోమీటర్ వరకు రోడ్లన్నీ కార్మికులతో నిండిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వం మొండిపట్టు వీడి తమ డిమాండ్లను అంగీకరించేంత వరకూ సమ్మెను నిలిపేది
లేదని జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంలో తమ పాత్ర కీలకమైందని గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో కూడా తాము అనేక పర్యాయాలు సమ్మె చేశామని, అయితే, గత ప్రభుత్వాలు ఎన్నడూ కేసీఆర్ తరహాలో నిరంకుషంగా వ్యవహరించలేదని వ్యాఖ్యానించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సమ్మె చేయాల్సిన పరిస్థితిని తాము ఏనాడూ భావించలేదన్నారు. ప్రస్తుతం తమ గమ్యం దూరంగా ఉందని, అయినా దాన్ని త్వరలోనే చేరతామని తెలిపారు. తాము రామాయణంలో ఉడతల్లాంటి వాళ్లమని, అయితే, రాముడికి ఉడతలు సరైన మార్గం చూపించాయని వ్యాఖ్యానించారు. ఉడతలు లేకపోతే రామాయణమే లేదని, అలాగే తాము లేకపోతే తెలంగాణ సాధ్యమయ్యేది కాదన్నాని పేర్కొన్నారు. కాగా, తమ డిమాండ్లపై సర్కార్ దిగివచ్చే వరకూ పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నేతలంతా స్పష్టం చేశారు.
ఆర్టీసీ కార్మికులకు సరాసరిన 50 వేల రూపాయల వేతనం ఇస్తున్నామంటూ ముఖ్యమంత్రి పేర్కొనడాన్ని జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డి గుర్తు చేస్తూ, అంత మొత్తాన్ని ఎవరికి చెల్లిస్తున్నారని ప్రశ్నించారు. ఆర్టీసీలో యూనియన్లు వద్దని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మిక సంఘాలు ఉండబోవని ఎద్దేవా చేశారు. ఆర్టీసీ పరిరక్షణ కోసమే తాము ఉద్యమం చేస్తున్నామని, తమ లాభం కోసం కాదని స్పష్టం చేశారు. కార్మికులకు సంఘీభావం తెలియచేస్తూ వివిధ సాంస్కృతిక సంస్థలు పాటలు పాడి ఉత్తేజం కలిగించాయి.
*చిత్రం... సభకు హాజరై సంఘీభావం తెలుపుతున్న అఖిలపక్ష నేతలు