తెలంగాణ

ఈఎస్‌ఐ స్కాంలో మరో కోణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ చేపడుతున్న దర్యాప్తులో రోజుకో కొత్త అవినీతి కోణం వెలుగు చూసింది. ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) విభాగంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక దృష్టి సారించి వివిధ కిట్ల కొనుగోళ్లను పరిశీలించింది. మెడికల్ కిట్ల కోసం పెట్టిన ఇండెంట్లలో గోల్‌మాల్ జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో మాజీ డైరెక్టర్ దేవికారాణి, మాజీ జేడీ పద్మతోపాటు ఓనీ మెడీ ఫార్మా కంపెనీల పాత్ర ఉండటం గమన్హారం. ఇప్పటికే ఈ కేసులో దేవికారాణి, పద్మ, ఓమ్ని మెడీ సిబ్బందిని విచారించిన ఏసీబీ అధికారులు రాబట్టి పలు కీలక విషయాల ఆధారంగా కేసులో ముందుకెళ్తున్నారు. ఈఎస్‌ఐ పరిధిలోని కార్మికులకు వైద్య సేవల పేరిట కోట్లు దండుకున్న ప్రాణాంతక హెచ్‌ఐవీ పరీక్ష కిట్ల కొనుగోలులో మోసాలకు పాల్పడ్డారు. బీమా వైద్య సేవల (ఐఎంఎస్) విభాగంలో కార్మికులకు వైద్య పరీక్షల నిమిత్తం హెచ్‌ఐవీ కిట్లను వినియోగించినట్లు ఐఎంఎస్‌లో బోగస్ రికార్డులు సృష్టించి దోపిడీకి పాల్పడ్డారని అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. 2017-18 సంవత్సరంలో హెచ్‌ఐవీ, హిమోగ్లోబిన్, మధుమేహం తదితర వ్యాధి నిర్ధారణ పరీక్షల కిట్ల కోసం రూ.1.02 కోట్లను దారి మళ్లించి దోచుకున్నారని అధికారులు గుర్తించారు. 200 రకాల పరీక్షల కిట్ల కోసం రూ. 6.8 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలో చూపించారు. అందులో హెచ్‌ఐవీ కిట్ల కొనుగోలుకు రూ.1.72 కోట్లు ఖర్చు చేసినట్లు చూపి, రూ.1.02 కోట్లను దారిమళ్లించి దోచుకున్నారని అధికారులు గుర్తించారు. 200 రకాల పరీక్షల కిట్లతో కూడిన సెట్‌కు రూ.17,600 వెచ్చించినట్లు ఏసీబీ గుర్తించింది. ఇందులో ఒక్కో కిట్‌కు రూ. 88 వెచ్చించారు. కాగా, ఇది బహిరంగ మార్కెట్‌లో రూ. 30కే దొరుకుతున్నట్లు దర్యాప్తులో అధికారులు తేల్చారు. వీటన్నింటినీ పరిశీలిస్తే దోచుకోవడానికి మాత్రమే ఐఎంఎస్ విభాగాన్ని నిర్వహించినట్లు తెలుస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఐఎంఎస్ ముఠా ఏడు డిస్పెన్సరీలకు ఎక్కువ మొత్తంలో ఔషధాలు, కిట్లు కొనుగోలు చేసి పంపించినట్లు చూపి నిధులు దోచుకున్నారు.