తెలంగాణ

ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డితో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ టీ. పద్మారావుగౌడ్, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, జీ. జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీహెచ్ మల్లారెడ్డి, టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు హాజరై సైదిరెడ్డికి పుష్పగుచ్చాలతో శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సైదిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, హుజూర్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా, అన్ని విధాలా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, హుజూర్‌నగర్ అంటే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డ అనేవారని చెప్పారు. కానీ, అదే గడ్డ మీద కేసీఆర్ దెబ్బ ఏమిటో చూపించామన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హయాంలో హుజూర్‌నగర్ నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. హుజూర్‌నగర్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తెలిపారు. నవంబర్ ఒకటిన హుజూర్‌నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేస్తారని పల్లా వివరించారు.
ఇలావుండగా పీయూసీ చైర్మన్‌గా నియమితులైన జీవన్‌రెడ్డి కూడా శాసనసభ ఆవరణలోని తన కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. పలువురు మంత్రులు, పార్టీ నాయకులు హాజరై జీవన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
*చిత్రం... సైదిరెడ్డిని అభినందిస్తున్న మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు