తెలంగాణ

డిసెంబర్ 31లోగా జీవన్ ప్రమాణ్ సమర్పించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: భవిష్య నిధి పెన్షన్‌దారులు వచ్చే నవంబర్ నెలలో డిజిటల్ జీవన్ ప్రమాణ్‌ను భవిష్య నిధి కార్యాలయానికి సమర్పించాలని హైదరాబాద్ భవిష్యనిధి అసిస్టెంట్ పీఎఫ్ కమిషనర్ కోరారు. అంతరాయం లేకుండా ప్రతి నెల పెన్షన్ మంజూరుకు సహకరించాలని ఆయన కోరారు. పెన్షన్ పొందే బ్యాంకు బ్రాంచ్‌లకు వెళ్లి డిజిటల్ జీవన్ ప్రమాణ్‌ను సమర్పించాలని ఆయన భవిష్య నిధి పెన్షన్‌దారులను కోరారు. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీలోగా డిజిటల్ జీవన్ ప్రమాణ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. సందేహాలు ఉంటే 040-27564571 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని కోరారు.