తెలంగాణ

శాస్ర్తియ పద్ధతిలో నీరా, తాడిని విశే్లషించి ప్రజలకు తెలియజేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: నీరా, తాడిని శాస్ర్తియ పద్ధతుల్లో విశే్లషించి ప్రజలకు తెలియచేసేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం పద్మనాభ రెడ్డి గవర్నర్‌కు లేఖ రాశారు. నీరాను విక్రయించేందుకు తెలంగాణ ప్రభుత్వం నీరా పాలసీని తెచ్చిందని, అందుకు అనుగుణంగా అబ్కారీ చట్టానికి సవరణలు చేశారన్నారు. కల్లు, గీత సహకార సొసైటీలకు లైసెన్సులు ఇవ్వనున్నారన్నారు. నీరాలో అనేక ఔషధ గుణాలున్నాయని, మధుమేహ వ్యాధికి ఔషధంగా పనిచేస్తుందన్నారు. కేరళలో ప్రభుత్వం నీరా, తాడిని మత్తు పదార్థంగా చట్టంలో చేర్చడం, దానిపై తాడి లైసెన్సు, దుకాణాదారల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు చెప్పరు. నీరా అనేది తాటి, ఇతర చెట్టల నుంచి ఫర్‌మెంట్ కాని ద్రవపదార్థమన్నారు. ఇందులో మత్తు పదార్ధాలు ఉండవని, కాని దురుపయోగం చేసే అవకాశాలున్నాయన్నారు. నీరా కొద్ది పాటివేడిలో కల్లుగా మారిపోతుందన్నారు. కేరళ ప్రభుత్వం ఈ పానీయాన్ని కూడా మత్తు పానీయాల జాబితాలో చేర్చిందన్నారు. బీరులో 6 శాతం ఆల్కోహాల్ ఉండగా, తాడిలో 8.1 శాతం ఆల్కోహాల్ ఉందన్నారు. నీరా పేరుతో పెద్ద ఎత్తున మార్కెట్‌లో తాడి అమ్మకం జరిగే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం ట్యాంక్ బండ్ పరిసరాల్లో, జాతీయ, రాష్ట్ర,రోడ్లు పక్కన దుకాణాలు తెరిచి నీరా అమ్మకానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు.