తెలంగాణ

సాంబశివరావు ఆమరణ దీక్ష విరమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: ఆర్టీసీ కార్మికులకు సంఘీభావం తెలుపుతూ ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తన దీక్ష విరమించాలని కోరుతూ బుధవారం ఆర్టీసీ జేఏసి నిర్వహించిన ‘సకల జన భేరీ’ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. సభ చివరలో జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టగా సభ ఏకగ్రీవంగా ఆమోందించింది. గురువారం ఉదయం 10 గంటలకు తాము సాంబశివరావువద్దకు వెళుతున్నామని, అన్ని పార్టీల నేతలు కూడా రావాలని ఆయన ఆహ్వానించారు. సాంబశివరావుకు నిమ్మరసం ఇచ్చి నిరాహార దీక్ష విరమింపచేస్తామన్నారు.
ఇలాఉండగా ఆర్టీసీ కార్మికులు గురువారం మధ్యాహ్నం నుండి 24 గంటల పాటు రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపట్టాలని అశ్వత్థామ రెడ్డి పిలుపు ఇచ్చారు. తమ పోరాటానికి మద్దతు తెలిపిన అన్ని రాజకీయ పార్టీలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సమ్మె ప్రారంభమైన తర్వాత ఆత్మహత్య చేసుకున్న వారితో పాటు మొత్తం 15 మంది కార్మికులు మరణించారని, వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతూ సభ రెండు నిమిషాల పాటు వౌనం పాటించింది.