తెలంగాణ

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమస్యపై చట్టాన్ని ఉల్లంఘించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె సమస్యపై చట్టాన్ని ఉల్లంఘించకుండా ఉండాలని రాష్ట్రప్రభుత్వ అదికారులకు టీపీసీసీ కోశాధికారి గూడూరి నారాయణ రెడ్డి కోరారు. ఆర్టీసీ సమస్యపై హైకోర్టును తప్పుదోవ బట్టించాలని సీఎం కేసీఆర్ సీనియర్ బ్యూరోక్రాట్లను, ఇతర అధికారులను బలవంతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దురదృష్టవశాత్తు చాలా మంది సీనియర్ అధికారులు ఉద్దేశ్యపూర్వకంగా లేదా తెలియకుండా చట్టం, నియమాలను ఉల్లంఘించడంలో సీఎంకు మద్దతు ఇస్తున్నారన్నారు. కేసీఆర్ రాజకీయ, వాణిజ్య ప్రయోజనాలను పరిరక్షించే బదులు అదికారులు నియమాలను పాటించాలన్నారు. దాదాపు 50వేల మంది ఉద్యోగులు వారాల తరబడి సమ్మె చేస్తున్నారని, వారి డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలవాలన్నారు.