తెలంగాణ

ఆంగ్ల భాషా ప్రావీణ్య నిర్ధారణకు టీసీఎస్ ఐయాన్‌తో ఇఫ్లూ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, నిపుణుల ఆంగ్లభాషా ప్రావీణ్యాన్ని వైయుక్తికంగా నిర్ధారించే బృందంలో తోడ్పాటు అందించేందుకు ఇఫ్లూ ముందుకు వచ్చింది. దీంతో ఇఫ్లూ సిబ్బంది సేవలను ఆంగ్ల భాషా ప్రావీణ్య నిర్ధారణ నిపుణులుగా వినియోగించుకునేందుకు టీసీఎస్ ఐయాన్ ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వీరిని డిజిటల్ మార్కింగ్ నిపుణులుగా వ్యవహరించనున్నారు.
ఈ ఒప్పందంపై టీసీఎస్ ఐయాన్ గ్లోబల్ హెడ్ వెంగుస్వామి రామస్వామి, ఇఫ్లూ వీసీ ప్రొఫెసర్ ఈ సురేష్‌కుమార్‌లు సంతకాలు చేశారు. వీడియో, ఆడియో రూపంలో ఉన్నా, పెన్ను కాగితంపై జరిగే పరీక్ష ద్వారానైనా ఇఫ్లూ ఆంగ్లభాషానిపుణులు పరీక్షించి వైయుక్తికంగా వారి సామర్థ్యాలను అంచనా వేసి, విశే్లషణలతో కూడిన మూల్యాంకనాన్ని అందజేస్తారు. ఇప్పటికే జాతీయ ప్రవేశపరీక్షలతో పాటు అంతర్జాతీయ ప్రవేశపరీక్షల నిర్వహణలో టీసీఎస్ ఐయాన్ పేరుగడించింది. ఆన్‌లైన్‌లో ఆంగ్లభాషా ప్రావీణ్య పరీక్షలను నిర్వహించి వారికి గుర్తించిన సర్ట్ఫికేట్లను జారీ చేస్తే ఆ సర్ట్ఫికేట్ల ద్వారా విద్యార్థులు తమ యూజీ, పీజీ చదువులను పూర్తి చేసేందుకు వీలుంటుంది. మరీ ముఖ్యంగా విదేశాల్లో చదవాలనుకునే వారికి కొన్ని దేశాలు ఆంగ్లభాషా ప్రావీణ్యాన్ని నిర్బంధం చేశాయి. ఈ సందర్భంగా వెంగుస్వామి రామస్వామి, సురేష్‌కుమార్‌లు మాట్లాడుతూ ఈ ఒప్పందం వర్శిటీ స్థాయినీ, మరో పక్క టీసీఎస్ ఐయాన్ స్థాయిని పెంచుతుందని పేర్కొన్నారు.