తెలంగాణ

యాదాద్రిలో నిత్యాన్నదాన భవన నిర్మాణానికి భూమిపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, అక్టోబర్ 30: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించే భక్తులకు నిత్య అన్న ప్రసాదం అందించేందుకు ఉద్దేశించిన నూతన భవన నిర్మాణ పనులను కొండ కింద గండి చెరువు సమీపంలోని స్థలంలో భూమి పూజతో ప్రారంభించారు.
ఈ భూమి పూజలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఈవో గీత, ధర్మకర్త బి.నరసింహమూర్తి, వైటీడీఏ వైస్ చైర్మన్ జి.కిషన్‌రావులు పాల్గొన్నారు. శ్రీ వేగేషన్ ఫౌండేషన్ ఆనందరాజు 12కోట్ల విరాళంతో ఈ నిత్యాన్నదాన ప్రసాద భవనాన్ని నిర్మింపచేస్తున్నారు.
హుండీ ఆదాయం రూ. 35.32 లక్షలు
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి పదిహేను రోజుల హుండీ ఆదాయం లెక్కింపు బుధవారం నిర్వహించగా, 35లక్షల 32,868 రూపాయల ఆదాయం లభించినట్లుగా ఈవో గీత తెలిపారు. 110 గ్రాముల బంగారం, 2కిలోల నాలుగు వందల గ్రాముల వెండి కానుకలుగా వచ్చినట్లుగా తెలిపారు.
*చిత్రం...యాదాద్రి నిత్యాన్నదాన ప్రసాద భవనం నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న దృశ్యం