తెలంగాణ

1న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, అక్టోబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు దేశానికే ఆదర్శం కానుందని శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి రాజమల్లు అన్నారు. చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం శివారులో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ప్రారంభోత్సవ ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించారు. సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్ష చేశారు. ఏర్పాట్లలో ఎలాంటి నిర్లక్ష్యం, లోటుపాట్లు జరుగకూడదన్నారు. నవంబర్ 1న ఉదయం 10.30 గంటలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభించుకోబోతున్నామని వివరించారు. అనంతరం పారిశ్రామికవేత్తలతో సమావేశం ఉంటుందని, వారి సమస్యలను తెలుసుకుంటారని వివరించారు. ఇండస్ట్రియల్ పార్కులో రూ.150 కోట్ల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇండస్ట్రీయల్ పార్కు ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మహర్దశ రానుందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 40 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని పేర్కొన్నారు. కాలుష్యరహిత పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఇప్పటికే 450 పరిశ్రమల ఏర్పాటుకు భూమిని కేటాయించడం జరిగిందన్నారు. చాలా మంది పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. సుమారు రెండు వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని చెప్పారు. విశాలమైన రోడ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. మోడల్ పార్కుగా తీర్చిదిద్దుతామన్నారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పరిశ్రమల ఏర్పాటు, నిరుద్యోగ సమస్య పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అవకాశాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనలో స్థానికులకే అధిక ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకటనరసింహారెడ్డి, టిప్ చైర్మన్ సుధీర్‌రెడ్డి, సెక్రటరీ గోపాల్‌రావు, జీఎం విఠల్, ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ చిట్టంపల్లి శ్రీనివాస్‌రావు, నాయకులు పెద్దిటి బుచ్చిరెడ్డి, ముత్యాల భూపాల్‌రెడ్డి, బొంగు జంగయ్యగౌడ్, పిల్లలమర్రి శ్రీనివాస్, ఉప్పు కృష్ణ తదితరులు ఉన్నారు.
*చిత్రం...ఇండస్ట్రియల్ పార్కులో పర్యటిస్తూ అభివృద్ధి పనులను పరిశీలిస్తున్న శాసనమండలి విప్ కర్నె ప్రభాకర్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి రాజమల్లు