తెలంగాణ

ఆర్టీసీ ప్రై‘వేటు’ను మేనిఫెస్టోలో పెట్టారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నారా అంటూ కాంగ్రెస్ రాష్ట్ర పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన సభకు రేవంత్‌రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రేవంత్‌రెడ్డి సభలోకి వస్తున్న సమయంలోనూ, మాట్లాడుతున్న సమయంలోనూ కార్మికులు పెద్ద ఎత్తున హర్షద్వానాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వలేదంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ, అద్దెబస్సులు ప్రవేశపెడతామని, ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తామని హామీ ఇచ్చారా అంటూ కేసీఆర్‌ను ప్రశ్నించారు. కార్మికులు సమ్మె ఉపసంహరించుకోకపోతే ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేస్తామంటూ కేసీఆర్ బెదిరించడాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆర్టీసీ నష్టాలపాలు కావడానికి కేసీఆర్ ప్రభుత్వ విధానాలే కారణమని ఆరోపించారు. డీజిల్‌పై 22.50 శాతంగా ఉన్న పన్నును 27.50 శాతానికి పెంచారని దాంతో ఆర్టీసీపై 700 కోట్ల రూపాయల భారం పెరిగిందన్నారు. ఇదే సమయంలో ఏయిర్ బస్సులకు వాడే ఇంధనంపై గతంలో 34 శాతం పన్ను ఉండగా, దాన్ని 1 శాతానికి తగ్గించారని, దాంతో ప్రభుత్వానికి 500 కోట్ల రూపాయలు నష్టం వస్తోందన్నారు. పేదలు ఉపయోగించే ఎర్రబస్సులకు వాడే డీజిల్‌పై పన్ను పెంచడం పట్ల అభ్యంతరం తెలిపారు. బస్సుల్లో రాయితీపై ప్రయాణించేందుకు 18 రకాల పాస్‌లను ఇచ్చిన ప్రభుత్వం ఈ మేరకు వచ్చే నష్టాన్ని ఆర్టీసీకి భర్తీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో 135 చోట్ల ఆర్టీసీ ఆస్తులను కేసీఆర్ తన మనుషులకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇవన్నీ నష్టాలకు కారణం కాదా అంటూ ప్రశ్నించారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ బిజేపీ నాయకుడు వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. అబద్దాలు చెప్పడం కేసీఆర్‌కు పెట్టింది పేరన్నారు. కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనగా మారిందన్నారు. తెలంగాణలో మనం ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నామా అన్న అనుమానం కలుగుతోందని సీపీఐ నాయకుడు చాడా వెంకటరెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 1932 లో ప్రారంభమైన ఆర్టీసీని మూసివేస్తామంటూ కేసీఆర్ బెదిరించడం హాస్యాస్పదమన్నారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటే దాన్ని ఏ విధంగా ప్రైవేట్‌పరం చేస్తారని ప్రశ్నించారు. ఆర్టీసీ సమ్మెపై కేంద్రం జోక్యం చేసుకోవాలని చాడా కోరారు. కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఆర్టీసీ ప్రైవేటైజేషన్‌కు అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు అన్ని పార్టీలతో పాటు తాము కూడా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరుగుతున్న ఆర్టీసీ సమ్మె అద్బుతమైందంటూ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ప్రశాంతంగా జరుగుతున్న ఆందోళన తెలంగాణ ఆర్టీసీ ఆందోళన మాత్రమేనని పేర్కొన్నారు. నల్లగొండలో ఆత్మహత్య చేసుకున్న జలీల్ అనే కార్మికుడు తన వేతనం 21 వేల రూపాయలని, కోతలు (కట్టింగ్‌లు) పోగా తొమ్మిది వేల రూపాయలు మాత్రమే ఇంటికి తీసుకువెళ్లేవాడినంటూ తన లేఖలో పేర్కొన్నారని కోదండరాం గుర్తు చేస్తూ, ఆర్టీసీ కార్మికుల అందరి పరిస్థితి ఇలాగే ఉందన్నారు. సమ్మె ప్రారంభమైన తర్వాత 15 మంది కార్మికులు చనిపోయారని, కార్మికులను కేసీఆర్ బలితీసుకున్నారని భావించాల్సి వస్తోందన్నారు. త్వరలోనే ట్యాంక్‌బండ్‌పై మరో దఫా ‘మిలియన్ మార్చ్’ చేపడతామని ప్రకటించారు. కేసీఆర్‌కు భయపడి అందరూ జేజేలు పలుకుతుండగా, తొలుత సవాల్ విసిరింది ఆర్టీసీ కార్మికులేనని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పొగిడారు. తెలంగాణ వచ్చిన తొలిరోజే దళితులకు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఎవరినైనా ఉపయోగించుకుని, పని పూర్తవగానే దూరం చేయడం కేసీఆర్‌కు అలవాటన్నారు. ఆర్టీసీ సమ్మె ప్రారంభం కాగానే కేసీఆర్ బెదిరించారని, 48 వేల మంది కార్మికులు, ఉద్యోగులు డిస్‌మిస్ చేస్తామన్నారని గుర్తు చేశారు. ఆర్టీసీని కూడా కేసీఆర్ కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో బిజేపీ నేత జితేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు హన్మంతరావు, సీపీఎం నేతలు మాట్లాడారు.
*చిత్రాలు.. .. హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన ఆర్టీసీ సకల జనభేరి సభలో మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి