తెలంగాణ

కార్మికుల సమస్యలు ఆమోదించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: ఆర్టీసీ కార్మికుల సమస్యలను తక్షణం ఆమోదించాలని, బస్సుల సమ్మెకు ముఖ్యమంత్రి ముగింపు పలకాలని నిమ్స్‌లో ఐదు రోజులుగా నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న సీపీఐ సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. బుధవారం నాడు అనేక మంది వామపక్ష నేతలు కూనంనేనిని కలిసి పరామర్శించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ కే నాగేశ్వర్, చాడ వెంకటరెడ్డి సహా మాజీ రాజ్యసభ సభ్యుడు అజీజ్ పాషా, సీపీఎం కార్యదర్శివర్గ సభ్యుడు పొతినేని సుదర్శనరావు, సీపీఎం నేత నున్నా నాగేశ్వరరావు, బత్తుల లెనిన్, మాదినేని రమేష్, టీ నాగరాజు, బషీర్, వి సదానంద్ తదితరులు కూనంనేనిని పరామర్శించారు. ఈ సందర్భంగా భారత జాతీయ మహిళా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు పోటు కళావతి మాట్లాడుతూ న్యాయమైన ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. కార్మిక సంఘాలు చేస్తున్న పోరాటాలను పోలీసులను అడ్డుపెట్టుకుని అణచివేయాలని చూస్తే ఊరుకునేది లేదని అన్నారు. ఈ సందర్భంగా నేతలు నిమ్స్ ఆస్పత్రి ముందు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని వౌన ప్రదర్శన నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వానికి చీవాట్లు పెట్టినా సీఎంకు పట్టింపు లేదని అన్నారు. ప్రజల సమస్యలు, ఇబ్బందులను పట్టించుకోకుండా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రగతిభవన్ గడిలో కూర్చుని నియంత పాలన సాగిస్తే ప్రజలు తిరుగబడతారని , మొండిపట్టు వీడి వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని లేకుంటే మహిళలే భవిష్యత్ ఉద్యమాలకు సారధ్యం వహించి నిరంకుశ కేసీఆర్‌ను గద్దె దించుతారని అన్నారు. వౌన ప్రదర్శనలో నేదునూరి జ్యోతి, ఎస్ ఛాయాదేవి, ఉస్తెల సృజన, సదాలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. నిరసన హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.
సీపీఎం నేతలు డీజీ నర్సింహరావు, బి వెంకట్ తదితరులు కూనంనేనిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
*చిత్రం...కూనంనేనిని పరామర్శిస్తున్న మంద కృష్ణ, వీహెచ్ తదితరులు