తెలంగాణ

కోర్టులకు విలువ ఇవ్వరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 30: ఆర్టీసీ కార్మికుల సమ్మెను పరిష్కరించేందుకు చొరవ తీసుకోకుండా, కోర్టుల ఆదేశాలను బేఖాతరు చేయడం సీఎం కేసీఆర్‌కు తగదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఆర్టీసీ అంశంపై కోర్టులో వాదనలు జరుగుతుంటే, మరో పక్క ప్రైవేట్ బస్‌లకు పర్మిట్‌లు ఇవ్వడమేంటన్నారు. ఆర్టీసీలో కేంద్రం వాటా 30 శాతం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు కోరినా, సామాన్య జనాల అభ్యర్థనలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం కేసీఆర్‌కు తగదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారన్నారు. న్యాయ స్థానాల మాటలకు విలువ ఇవ్వని ప్రభుత్వాలు ఎందుకన్నారు. గాంధీ సంకల్ప యాత్రను కొన్ని పార్టీలు విమర్శించడం వారి కుత్సిత బుద్ధికి నిదర్శనమన్నారు. గాంధీ పేరును తోకలుగా తగిలించుకుని నకిలీ గాంధీలుగా చెలామణి అవుతున్నారన్నారు. ఇందిరాగాందీ, సోనియాగాంధీ , రాహుల్ గాంధీ అని గాంధీ పేరును తగిలించుకున్నారన్నారు. తెలంగాణలో టీర్‌ఎస్‌కు తోక పార్టీగా కాంగ్రెస్ మారిపోయిందన్నారు.
*చిత్రం...బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్