తెలంగాణ

వౌలిక రంగానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: సాంకేతిక పరిజ్ఞానం తోడ్పాటుతో వివిధ భవనాల నిర్మాణాలకు అనుమతుల మంజూరును సరళీకృతం చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. గురువారం ఇక్కడ ఆయన భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం వౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఆర్థికాభివృద్ధి, పరిశ్రమల ప్రగతిలో తెలంగాణ ఉరకలు వేస్తోందన్నారు. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకత ఉందని, అందుకే రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుందన్నారు. జవాబుదారీతనంతో అధికారులు, డెవలపర్లు పనిచేయాలన్నారు. వౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందినే రాష్ట్రం ప్రగతి సాధిస్తుందాన్నరు. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను డెవలపర్లు ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. సీఐఐ తెలంగాణ కన్వీనర్ సీ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంగా వస్తుసేవా పన్ను, రియల్ ఎస్టేట్ చట్టాలపై డెవలపర్లు అడిగిన ప్రశ్నలకు సోమేష్ కుమార్ బదులిచ్చారు.