తెలంగాణ
ఆర్టీసీ కండక్టర్‌కు గుండెపోటు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 1 November 2019
వరంగల్, అక్టోబర్ 31: వరంగల్ నగరంలోని హన్మకొండ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తన్న ఏ.రవీందర్‌కు గురువారం సాయత్రం గుండె పోటు వచ్చింది. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన రవీందర్ హన్మకొండ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెతో తీవ్ర మనస్థాపానికి గురై అస్వస్థతకు గురై గుండె పోటు రావడంతో ఆయనను హుటాహుటిన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆర్టీసీ కార్మికులు తెలిపారు.
కాగా రవీందర్ గత కొన్ని రోజులగా ఆర్టీసీ సమ్మెలో చురుకుగా పాల్గొంటున్నారు. గురువారం కూడా ఆర్టీసీ దీక్షా శిబిరంలో పాల్గొన్నారు.
*గుండె పోటుకు గురైన కండక్టర్ రవీందర్ (ఫైల్ ఫొటో).