తెలంగాణ

మీరే దిక్కు.. జోక్యం చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: ఆర్టీసీ సమ్మెను విరమించడానికి ప్రభుత్వం చొరవ చూపాలని రాష్ట్ర హైకోర్టు సూచించినా ఫలితం దక్కలేదని, ఇక మీరే మాకు దిక్కు అంటూ అఖిలపక్ష నేతలు గవర్నర్‌ను కోరారు. గురువారం అఖిలపక్ష నేతలు గవర్నర్ కలసి ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, కాంగ్రెస్ సీఎల్‌పీ నేత బట్టి విక్రమార్క, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి, జాతీయ కాంగ్రెస్ నాయకుడు హనుమంతరావులు మీడియా మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన కోర్కెలను సైతం తీర్చడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. గత 26 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. ఆర్థిక అంశాలను ముడిపెట్టి సమ్మెను విరమించడానికి ప్రభుత్వం జాప్యం చేయడం దుర్మార్గం అన్నారు. సెప్టెంబర్ 19న ఆర్టీసీలో పని చేస్తున్న కార్మిక సంఘాలు తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ యాజమాన్యానికి మెమోరాడం అందించాయని వారు గుర్తు చేశారు. సమ్మెను కార్మిక సంఘాల శాంతి యుతంగా నిర్వహిస్తున్నాయన్నారు. ఆర్టీసీకి నష్టాలు రావడానికి పెరిగిన డీజల్ ప్రధాన కారణమన్నారు. విద్యార్థలకు, ఉద్యోగులకు, వృద్దులకు బస్ చార్జీల్లో రాయితీలను అమలు చేయడంతో ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయన్నారు. సమ్మె ప్రభావంతో ఇటు ఆర్టీసీ కార్మికులకు, అటు ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని గవర్నర్‌కు సూచించామన్నారు. ఆర్టీసీ మనుగడ సాధించడానికి కార్మికులు రేయింబవళ్లు కష్టపడుతున్నట్లు వారు చెప్పారు. ఆర్టీసీలో దాదాపు 7వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ చేశారన్నారు. వారి స్థానంలో కార్మికులను భర్తీ చేయకుండా ఉన్న వారిపై అదనపు భారం పడుతోందన్నారు. కార్మికుల సంఖ్య తక్కువ ఉన్నా ప్రస్తుతం రోజూ 34 లక్షల కిలోమీటర్ల నుంచి 38 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం పెంచారన్నారు. ఏటా ఆర్టీసీకి నికర ఆదాయం రూ.3990 కోట్ల నుంచి రూ. 4882 కోట్లకు పెరిగినట్లు వారు గుర్తు చేశారు. ఆర్టీసీ సంక్షోభంలో పడకుండా మీరే పరిష్కరాన్ని చూపాలని గవర్నర్‌ను కోరినట్లు వారు తెలిపారు. సమ్మె ప్రభావంతో 4గురు కార్మికులు బలవర్మరణం చేసుకున్నారన్నారు. మరో 12 మంది కార్మికులు సమ్మె పరిష్కారం అవుతుందో లేదోనని బెంగతో మృతి చెందారన్నారు.
ఇలాంటి సున్నితమైన సమస్యను పరిష్కరించడానికి మీరే ప్రయత్నించాలని గవర్నర్‌ను కోరినట్లు వారు చెప్పారు. ఆర్టీసీలో పని చేస్తున్న 48 వేల మందితో పాటు ప్రజా రవాణాకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని గవర్నర్‌ను కోరినట్లు వెల్లడించారు.

*చిత్రం... గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తున్న అఖిలపక్ష నేతలు