తెలంగాణ

కూనంనేని దీక్ష విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిమ్స్‌లో నిరవధిక దీక్ష కొనసాగిస్తున్న కూనంనేని సాంబశివరావు వైద్యుల సూచన మేరకు గురువారం నాడు దీక్షను విరమింపచేశారు. సాంబశివరావు ఆరోగ్యం క్షీణించిందని, ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొనడంతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సహా పలువురు నేతలు ఆస్పత్రికి వెళ్లి సాంబశివరావు దీక్షను విరమించపచేశారు. సీపీఐ ఆఫీసులోనే కూనంనేని దీక్షను ప్రారంభించినా, పోలీసులు ఆయనను అరెస్టు చేసి నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుండి ఆయన నిరవధిక దీక్షను కొనసాగిస్తున్నారు. సీపీఐ నేతలు గురువారం నాడు నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి కూనంనేనికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవని, ప్రభుత్వం ఇప్పటికైనా పంతానికి పోకుండా ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి పరిష్కరించాలని ఆయన సూచించారు. ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ విలీనంపై ధృడంగా ఉందని, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని తాను అభినందిస్తున్నానని కూనంనేని వ్యాఖ్యానించారు.
మంత్రుల నివాసాలు ముట్టడించిన ఎఐఎస్‌ఎఫ్
ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మంత్రుల నివాసాలను ఎఐఎస్‌ఎఫ్ నేతలు ముట్టడించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు పోరసాగిస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రావి శివరామకృష్ణ ప్రశ్నించారు. ఈకార్యక్రమంలో పుట్ట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఏఐటీయూసీ నేతల దీక్ష
ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఎఐటీయూసీ ఒకరోజు దీక్షను శుక్రవారం నిర్వహించనున్నట్టు జనరల్ సెక్రటరీ వీఎస్ బోస్ పేర్కొన్నారు.
గురుదాస్ దాస్‌గుప్తకు నివాళులు
సీపీఐ నేత, ఉద్ధండుడు గురుదాస్ దాస్‌గుప్త మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సహా పలువురు సీపీఐ, సీపీఎం నేతలు , అనుబంధ సంఘాలు, ప్రజా సంఘాల నేతలు తీవ్ర సంతాపాన్ని దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రజాహక్కుల సాధన కోసం పీడిత ప్రజల పక్షాన ఆయన చేసిన పోరాటాలను సీఎం కొనియాడారు. తాను ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఉన్నపుడు గురుదాస్ దాస్‌గుప్తాతో ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. దాస్‌గుప్త కుటుంబసభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దాస్‌గుప్త మృతి పట్ల సీపీఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. దాస్‌గుప్త అంత్యక్రియలకు తాను హాజరవుతున్నట్టు కే నారాయణ తెలిపారు. వేరొక ప్రకటనలో ప్రణాళికా సంఘం ఉపాధ్యయుడు వినోద్‌కుమార్ దాస్‌గుప్త మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేశారు.