తెలంగాణ

పదవీ కాలం తీరకముందే న్యాయశాఖ కార్యదర్శి పదవీ విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి వి నిరంజన్‌రావు తన పదవి కాలం ముగియకముందే గురువారం స్వచ్చందంగా పదవీ విరమణ చేశారు. పదవీ విరమణకు నిరంజన్‌రావు చేసుకున్న అభ్యర్థన మేరకు ఆయన్ను రిలీవ్ చేస్తూ సాధారణ పరిపాలనాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన పదవీ కాలం 2020, జనవరి 31న ముగియనుంది. అయితే మూడు నెలల ముందుగానే పదవి నుంచి తప్పుకోవడానికి కారణం ఏమిటన్నది తెలియరాలేదు. న్యాయశాఖ కార్యదర్శి పదవికి ఖాళీ ఏర్పడటంతో కొత్త కార్యదర్శి నియామకానికి హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన అందాల్సి ఉంది. అప్పటి వరకు తాత్కాలిక కార్యదర్శిగా సీనియర్ డిప్యూటీ కార్యదర్శిని నియమించే అవకాశం ఉంది. ఇలా ఉండగా న్యాయశాఖ కార్యదర్శి తన పదవీ కాలం ముగియకముందే స్వచ్ఛంద పదవీ విరమణ చేయడానికి కారణం ఏమై ఉంటుందనేది చర్చనీయాంశం అయింది. ప్రస్తుత పదవి కంటే ఉన్నతమైన మరో పదవికి నిరంజన్‌రావు నియమించే అవకాశం ఉండటం వల్లనే ఆయన రాజీనామా చేశారా? లేక ప్రభుత్వం నుంచి పొసగక తప్పుకున్నారా? అనేది తేలాల్సి ఉంది.