తెలంగాణ

హామీ తప్ప పరిష్కారం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా జాక్టో వివిధ కార్యక్రమాల్లో పాల్గొందని, సీఎం హామీ ఇచ్చినట్టు వెంటనే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జాక్టో నేతలు గురువారం నాడు కోరారు. హుజూర్‌నగర్ ఎన్నికల తర్వాత ఆర్టీసీ తదితర సమస్యలను పరిష్కరిస్తామని ఉద్యోగ జాక్ నేతలను ప్రగతి భవన్‌కు పిలిపించుకుని హామీ ఇచ్చిన సీఎం ఎన్నికల ఫలితాలు వచ్చి పది రోజులు గడుస్తున్నాల ఉలుకూ పలుకు లేదని వారు పేర్కొన్నారు. ఉద్యోగ , ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఇచ్చిన హామీలను ఎలాంటి జాప్యం లేకుండా అమలుచేస్తూ ఉత్తర్వులివ్వాలని టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఇ రఘునందన్, ప్రధానకార్యదర్శి ఇ రమణ పేర్కొన్నారు.
సీపీఎస్ రద్దు చేసి ఒపీఎస్ పునరుద్ధరించాలని, ఉదపాధ్యాయుల అంతర్‌జిల్లా బదిలీలు నిర్వహించాలని, ఖాళీగా ఉన్న ఎంఈఓ, డిప్యుటీ ఈఓ, డైట్ లెక్చరర్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని, 2016 మేలో ఎండిఎం విధులు నిర్వహించినా ఉపాధ్యాయులకు ఈఎల్ మంజూరు చేయాలని, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు, పీఆర్సీ రిపోర్టు తెప్పించుకుని 63 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలుచేయాలని కోరారు. బకాయి ఉన్న డీఏలు ప్రకటించడం, పండిట్, పీఈటీలను అప్‌గ్రేడ్ చేయడం , ఎన్నికల మేనిఫెస్టోల హామీ మేరకు రిటైర్‌మెంట్ వయస్సు 61 ఏళ్లకు పెంచడం, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించడం వంటి అనేక సమస్యలున్నాయని వారు పేర్కొన్నారు.