తెలంగాణ

మోదీ ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాలపై ఆందోళనలకు పిలుపునిచ్చిన టీపీసీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 31: ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా దశలవారీ ఆందోళన కార్యక్రమాలను చేపట్టాలని ఎఐసీసీ ఆదేశించినట్లు ఎఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ ఆర్‌సీ కుంతియా అన్నారు. ఈ కార్యక్రమం కింద ఈ నెల 8వ తేదీన అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ధర్నాలు నిర్వహించాలన్నారు. నవంబర్ 6వ తేదీన ఆర్థిక విధానాల వైఫల్యంపై ప్రెస్‌మీట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ నెల 16వ తేదీన రాజధాని హైదరాబాద్‌లో ర్యాలీని నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించేందుకు 33 జిల్లాలకు జిల్లా ఇన్‌చార్జీలను నియమించామన్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీలతో కలిసి ఈ నేతలు పనిచేయాలన్నారు.