తెలంగాణ

హాస్పిటల్స్ మాఫియా చేతిలో ప్రభుత్వం బందీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 2: రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, మాఫియా చేతిలో బందీ అయినట్లుగా అనిపిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత ఎన్ రాంచందర్ రావు అన్నారు. శుక్రవారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణ వ్యాప్తంగా వందలాది మంది డెంగ్యూ జ్వరం బారినపడి మరణిస్తున్నా, కేసీఆర్ సర్కార్క్ కనీస చర్యలు చేపట్టకపోవడం వెనక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. డెంగ్యూపై రాష్ట్రప్రభుత్వాన్ని హైకోర్టు తీవ్రంగా మందలించినా కనీసం సమీక్ష కూడా జరపకపోవడం వెనక రాష్ట్రప్రజల ఆరోగ్యంపైన చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. ఇంతవరకు పదివేల పైన డెంగ్యూ కేసులు నమోదయ్యాయన్నారు. డెంగ్యూతో ఎవలైరైనా చనిపోతే వారు డెంగ్యూతోకానీ, విష జ్వరాలతో కాని చనిపోయారని వెల్లడించవద్దని డాక్టర్లకు రాష్ట్రప్రభుత్వం అనధికార ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో చాలా వరకు డెంగ్యూ మరణాలు వెలుగులోని రావడం లేదన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌పై ముఖ్యమంత్రికి వ్యక్తిగతంగా కోపం ఉంటే ఉండవచ్చన్నారు. రాష్ట్రప్రజలపై ఆగ్రహం వద్దన్నారు. విష జ్వరాల నిర్మూలనకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. టీఆర్‌ఎస్ సర్కార్ జ్వరపీడితుల కోసం ఔషధాలకు ఈ ఆర్థిక సంవత్సరం రూ.72 కోట్లను మాత్రమే విడుదల చేయడం దురదృష్టకరమన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల నివారణ కోసం మొత్తం నిధుల కేంద్రమే ఇస్తుంటే అమలు చేయడంలో ప్రభుత్వ విఫలమైందన్నారు. కేంద్రప్రభుత్వం వివిధ ఆరోగ్య పథకాలు వ్యాక్సినేషన్, మలేరియా, టీబీ,కుష్టు,కుటుంబ ఆరోగ్య సంక్షేమ కోసం నిధులు కేటాయిస్తే రాష్ట్రప్రభుత్వం ఆ నిధులను దుర్వినియోగం చేసిందన్నారు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక గత ఐదు సంవత్సరాల్లో 40 శాతం కేంద్రం ఇచ్చిన నిధులు కూడా వినియోగించుకోలేక దురవస్థలోరాష్ట్రప్రభుత్వం పేద ప్రజలను అనారోగ్యం పాలు చేస్తుందన్నారు. వైద్య విద్య కోసం వివిధ వైద్య కళాశాలలకు కేంద్రం నిధులు కేటాయిస్తే వాటిని కూడా వినియోగించుకోలేని అసమర్థతతో రాష్ట్రప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన నగరాలతో పాటు నగరంలో 4 వెయ్యి పడకల ఆసుపత్రులు నిర్మిస్తామని సీఎం కేసీఆర్ గొప్పలు చెప్పారన్నారు.
2017లో 4500 మంది వైద్య సిబ్బంది నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసినా ఇంతవరకు నియామకాలు జరపకపోవడం కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతుందన్నాలవు. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసస్ రిక్రూట్‌మెంట్ బోర్డు జీవో జారీ చేసి తొమ్మిది నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఆ బోర్డు ఊసెత్తలేదన్నారు. ఇప్పటికైనా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వైద్య శాఖ అధికారులు ఏజన్సీ ఏరియాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజారోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు.