తెలంగాణ

సింగరేణిలో రోజుకు 2 లక్షల టన్నుల ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 1: ఈ ఏడాది అక్టోబర్ నెల వరకు రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి శాతం తగ్గుముఖం పట్టిందని, దీనిని అధిగమించడానికి యుద్ధప్రాతిపదికన రోజూ 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని సింగరేణి సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్ సింగరేణి భవన్‌లో శుక్రవారం సింగరేణి సీఎండీ ఏరియాలో మేనేజర్లతో ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎండీ శ్రీ్ధర్ ఉన్నతాధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత మూడు నెలలుగా సింగరేణి ప్రాంతంలో భారీ వర్షాలు పడ్డాయని, దీంతో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నవంబర్ నుంచి రోజూ 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది సింగరేణి ఏరియాలో అధిక వర్షాలు కురిసాయన్నారు. ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తి కుంటుబడిందన్నారు. బొగ్గు ఉత్పత్తి, రవాణా లక్ష్యాలతో పాటు నెలవారీ లక్ష్యాలను సాధించాలని ఆయన ఆదేశించారు. ఉత్పత్తి సమయంలో రక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కొత్త ఓపెన్ కాస్టు గనుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలన్నారు. ఒడిశాలో సింగరేణి చేపట్టిన నైనీ బొగ్గు బ్లాక్ పనులను కూడా ఆయన సమీక్షించారు. కొత్తగా కేటాయించిన న్యూపాత్రపద బొగ్గు గనుల్లో దశలవారీగా పనులు చేపట్టడానికి ప్రణాళికను రూపొందించాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డైరెక్టర్లు శంకర్, చంద్రశేఖర్, భాస్కర్‌రావు, బలరాం, ఆల్విన్, సురేందర్ పాండే, ఆంటోని రాజా, రమణమూర్తి, రవిశంకర్, వైజీకే మూర్తి, గణపతితో పాటు ఏరియా మేనేజర్లు పాల్గొన్నారని సంస్థ సీపీఆర్‌వో మహేష్ తెలిపారు.